ఒకపక్క అధికార పార్టీ వైసిపి సిద్ధం( YCP Siddham ) పేరుతో వరుసవరుసగా జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తోంది.లక్షలాది మంది జనాల మధ్య జగన్ తన ప్రసంగాలు వినిపిస్తూ, పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు.
జగన్ సభలకు భారీగా జనాలు తరలి వస్తుండడంతో టిడిపి, జనసేన లు కూడా భారీ సభలు నిర్వహిస్తూ, బల నిరూపణకు దిగుతోంది.నిన్న తాడేపల్లిగూడెంలో టిడిపి, జనసేన ఉమడి సభ( TDP Janasena Meeting )ను నిర్వహించారు.
ఇదిలా ఉంటే వైసిపి ఇప్పటికే అనేక సార్లు సిద్ధం సభలను భారీగా నిర్వహించి సక్సెస్ అయింది.తాజాగా బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం( Addanki Constituency ) మేదరమెట్టలో సిద్ధం సభను మార్చి 10న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఈ విషయాన్ని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి( YCP Vijaysai Reddy ) వెల్లడించారు.వాస్తవంగా మార్చి 3 న జరగాల్సిన సిద్ధం సభను 10వ తేదీకి మార్పు చేసినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.
సిద్ధం సభలకు ప్రజల నుంచి భారీగా స్పందన వస్తుందని, మొత్తం 15 లక్షల మంది ఈ సభ కు వస్తారని అంచనా వేస్తున్నామని విజయ సాయి రెడ్డి తెలిపారు.
![Telugu Ap Cm Jagan, Ap, Bapatla, Chandrababu, Jagan, Janasena, Pawan Kalyan, Sid Telugu Ap Cm Jagan, Ap, Bapatla, Chandrababu, Jagan, Janasena, Pawan Kalyan, Sid](https://telugustop.com/wp-content/uploads/2024/01/jagan-YCP-ap-politics-tdp-siddham-meeting-welfare-schemes.jpg)
సభా ప్రాంగణం, పార్కింగ్ కోసం స్థలం ఎంపిక పూర్తయ్యిందని,అక్కడ సభ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నాం.ఆరు జిల్లాల నుంచి కార్యకర్తలు హాజరవుతారు.ప్రభుత్వ పథకాలు, పాలనా తీరుపై పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి( YS Jagan ) సభలో మాట్లాడుతారు.13 ,14వ తేదీలలో ఎన్నికల ప్రకటన వచ్చే అవకాశం ఉందని, ఏప్రిల్ రెండవ వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.సిద్ధం సభకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.
![Telugu Ap Cm Jagan, Ap, Bapatla, Chandrababu, Jagan, Janasena, Pawan Kalyan, Sid Telugu Ap Cm Jagan, Ap, Bapatla, Chandrababu, Jagan, Janasena, Pawan Kalyan, Sid](https://telugustop.com/wp-content/uploads/2024/01/Siddham-ycp-ys-jagan-ap-politics-YCP-Election-Campaign.jpg)
పేద వర్గాలతో పాటు, అగ్రకులాలలో కూడా వైస్సార్ సీపీ కి అపూర్వ స్పందన వస్తోందని, ప్రభుత్వ పథకాలు గురించి సిద్ధం సభల్లో వివరిస్తున్నామని, గతంలో ఏ రాజకీయ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ చేయని విధంగా వైసిపి పాలన ఉందని విజయసాయిరెడ్డి అన్నారు.