ఆరేళ్ల తరువాత బయటపెడుతున్న నితిన్.. ఏమిటో తెలుసా?

యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ రిలీజ్‌కు రెడీ అవుతోంది.అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

 Nithiin To Show Dancing Skills After Six Years-TeluguStop.com

ఇక ఈ సినిమాతో నితిన్ తన డ్యాన్స్ ట్యాలెంట్‌ను దాదాపు ఆరేళ్ల తరువాత మరోసారి బయటపెడుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

భీష్మ సినిమాలో అన్ని అంశాలు పుష్కలంగా ఉండటంతో నితిన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని చిత్ర యూనిట్ తెలిపింది.

టాలీవుడ్‌లో ఉన్న బెస్ట్ డ్యాన్సర్లలో నితిన్ కూడా ఒకరు కావడంతో ఈ సినిమాలో ఆయన రెచ్చిపోయి డ్యాన్స్ చేశాడని చిత్ర యూనిట్ అంటోంది.ఈ రేంజ్‌లో నితిన్ డ్యాన్స్ చేయడం గతకొన్నేళ్లుగా ప్రేక్షకులు చూసి ఉండరని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాతో తన కెరీర్‌లో మరో సక్సెస్‌ను నితిన్ వేసుకుంటాడని వారు అంటున్నారు.

ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని, రష్మిక-నితిన్‌ల మధ్య నడిచే లవ్ ట్రాక్ యూత్‌ను బాగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ తెలిపారు.

ఫిబ్రవరి 21న రిలీజ్ కానున్న ఈ సినిమా ఎంతమేర విజయం సాధిస్తుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube