డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఇటీవలె తెరకెక్కిన సినిమా విక్రమ్.ఇందులో స్టార్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించాడు.
వివిధ భాషల్లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.ప్రస్తుతం ఈ సినిమా థియేటర్ లో బాగా సందడి చేస్తుంది.
విడుదలైన మొదటి రోజే మంచి వసూళ్లు సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా గురించి ప్రతి ఒక్క ప్రేక్షకుడు అద్భుతమైన రివ్యూస్ ఇస్తున్నారు.
ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఒక్కటే రివ్యూ ఇస్తున్నారు.ఇందులో నటించిన కమల్ హాసన్ పాత్ర గురించి చాలా రకాలుగా డిస్కస్ చేస్తున్నారు.కేవలం కమల్ హాసన్ నే కాకుండా ఇతర నటుల పాత్రలను కూడా పొగుడుతున్నారు.ముఖ్యంగా ఇంత మంచి సినిమా అందించిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కు మాత్రం ఈ సినిమాతో మరింత గుర్తింపు పొందింది.
తమిళ ఇండస్ట్రీకి చెందిన లోకేష్ కనగరాజ్ చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు.ఇక 2019 లో విడుదలైన ఖైదీ సినిమా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది.ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో చనిపోయిన క్యారెక్టర్ విక్రమ్ లో ఎలా బతికింది అని చూసిన ప్రేక్షకులంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ విషయం గురించి తాజాగా ఈ సినిమా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ క్లారిటీ ఇచ్చాడు.ఈయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాడు.ఇక తాజాగా ఆయన సినిమా మంచి సక్సెస్ కావడంతో కాసేపు నెటిజన్లతో ఆస్క్ డైరెక్టర్ లోకేష్ అంటూ ముచ్చటించాడు.

దీంతో నెటిజన్లు తమకు అనుమానం ఉన్న ప్రశ్నలు వేయగా అన్నింటికీ ఓపికగా సమాధానం ఇచ్చాడు.అంతేకాకుండా తన వ్యక్తిగత విషయాల గురించి కూడా వారికి చెప్పుకుంటూ వచ్చాడు.ఇదిలా ఉంటే అందులో ఒక నెటిజన్.
ఖైదీ లో చనిపోయిన అర్జున్ దాస్ పాత్ర మళ్లీ ఎలా బతికి వచ్చింది అని ప్రశ్నించగా దానికి లోకేష్ ఇలా సమాధానమిచ్చాడు.

అన్బు గడ్డం మాత్రమే పగిలింది.నెపోలియన్ వల్ల.అందుకే విక్రమ్ సినిమాలోని అన్బు పాత్రకి స్టిచ్ మార్క్ కనిపిస్తుంది.
ఇక దీని గురించి తెలియాలి అంటే ఖైదీ 2 లోనే అని అన్నాడు.మరి ఖైదీ 2 సినిమా విడుదల అయ్యే వరకు వేచి చూడక తప్పదు.
మొత్తానికి లోకేష్ ఈ సినిమాతో కూడా తన అద్భుతమైన దర్శకత్వాన్ని రుచి చూపించాడు.ఇక ఈయన ప్రతి ఒక్క విషయాన్ని అద్భుతంగా డీల్ చేస్తాడు అని చెప్పవచ్చు.
ఇక మొత్తానికే విక్రమ్ సినిమా ప్రస్తుతం భారీ వసూళ్లు సొంతం చేసుకోగా.ఈరోజు కూడా ఈ సినిమా థియేటర్లో బాగా సందడి చేస్తుంది.







