తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ఇప్పటివరకు తమిళంలో నటించిన సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు.ఈ క్రమంలోనే ఆయన నటించిన సినిమాలకు తెలుగులో కూడా మంచి ఆదరణ లభించడమే కాకుండా ఇతనికి తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
ఈ క్రమంలోనే విజయ్ హీరోగా పూర్తిస్థాయి తెలుగు చిత్రాన్ని నిర్మించాలని భావించారు.ఈ క్రమంలోనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో హీరో విజయ్ రష్మిక జంటగా తలపతి 66 అనే టైటిల్ తో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది.
ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుని వరుస షూటింగ్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల చేయడానికి నిర్మాత దిల్ రాజు సిద్ధమయ్యారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తూ.నిర్మాతగా కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.ఇకపోతే ఈ సినిమాలో పలువురు స్టార్ హీరోలు నటిస్తున్నట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని చిత్ర బృందం మంగళవారం అధికారకంగా ప్రకటిస్తూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఈ సినిమా షూటింగ్ కోసం హీరో శ్రీకాంత్ కు స్వాగతం పలుకుతూ వెల్ కమ్ ఆన్ బోర్డ్ అంటూ చిత్ర బృందం ఆయనకు స్వాగతం పలికారు.
ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ సినిమాలో శ్రీకాంత్ ఎలాంటి పాత్రలో నటిస్తారు ఏంటి అనే విషయం తెలియాల్సి ఉంది.







