పగలు జాబ్ సాయంత్రం ఇంజినీరింగ్.. రూ.2 కోట్ల జాబ్ సాధించిన ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఒకవైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు ఇంజినీరింగ్ చదవడం సాధారణమైన విషయం కాదనే సంగతి తెలిసిందే.కొన్నిసార్లు చదువుకోవాలని భావించినా పరిస్థితులు సహకరించవు.

 Kalyani Tummala Inspirational Success Story Details, Kalyani Tummala, Kalyani Tu-TeluguStop.com

అయితే కొంతమంది మాత్రం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి సత్తా చాటుతారు.అలా సత్తా చాటిన వారిలో కళ్యాణి తుమ్మల( Kalyani Tummala ) ఒకరు.

ప్రస్తుతం కళ్యాణి అమెరికాలోని( America ) ప్రముఖ అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్( Advanced Micro Devices ) సంస్థలో సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ మేనేజర్ గా( Software Development Manager ) ఆమె పని చేస్తున్నారు.

మేము ముగ్గురం ఆడపిల్లలమని మాది నందిగామ దగ్గర ఉన్న ముప్పాళ్ల( Muppalla ) అని ఆమె తెలిపారు.

మా కుటుంబం రైతు కుటుంబం అని ఎంత కష్టపడినా అప్పులే మిగిలేవని ఆమె చెప్పుకొచ్చారు.ఊహ తెలిసినప్పటి నుంచి నేను వ్యవసాయ పనులు చేశానని కళ్యాణి పేర్కొన్నారు.

ఎప్పుడైనా చదువు ఆగిపోవచ్చనే విధంగా దినదిన గండంగా నా జీవితం సాగిందని కళ్యాణి వెల్లడించడం గమనార్హం.

Telugu Advanced Micro, America, Farmers, Iit Kharagpur, Kalyani Tummala, Kalyani

నేను ప్రవేశ పరీక్ష రాయగా నిమ్మకూరు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ లో సీటు వచ్చిందని ఆమె పేర్కొన్నారు.పాలిటెక్నిక్ పరీక్షలో టాపర్ గా నిలిచానని ఆమె చెప్పుకొచ్చారు.ఆ తర్వాత క్యాట్ పరీక్ష రాసి 11వ ర్యాంక్ సాధించానని పగలు జాబ్ చేస్తూ సాయంత్రం కాలేజ్ లో ఇంజినీరింగ్( Engineering ) చదివానని ఆమె కామెంట్లు చేశారు.

చదువు పూర్తయ్యాక బెంగళూరు ఐబీఎంలో( Bengaluru IBM ) జాబ్ వచ్చిందని కళ్యాణి పేర్కొన్నారు.

Telugu Advanced Micro, America, Farmers, Iit Kharagpur, Kalyani Tummala, Kalyani

ఆ తర్వాత గేట్ రాసి ఆలిండియా స్థాయిలో 143వ ర్యాంక్ సాధించానని ఆమె తెలిపారు.ఆ తర్వాత బార్క్ లో ( BARC ) గ్రేడ్ సి సైంటిస్ట్ జాబ్ వచ్చిందని కళ్యాణి వెల్లడించారు.అయితే ఐటీ జాబ్ పై మక్కువతో ఐఐటీ ఖరగ్ పూర్ లో చేరానని చదువు పూర్తయ్యాక 7 లక్షల ప్యాకేజ్ తో జాబ్ వచ్చిందని కళ్యాణి చెప్పుకొచ్చారు.

అమెరికాలో 2 కోట్ల రూపాయల ప్యాకేజ్ తో జాబ్ లో చేరానని ప్రస్తుతం నా కూతురు పదో తరగతి చదువుతోందని ఆమె చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube