జబర్దస్త్ లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మి గౌతమ్ తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించింది.పొట్టి పొట్టి డ్రెస్సులతో జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది.
ఆ తర్వాత సినిమా అవకాశాలు కూడా అందుకుంది.గుంటూరు టాకీస్ సినిమా లో రష్మి గౌతమ్ అందాల ఆరబోత యూత్ అందరిని మత్తెక్కించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇటీవల కాలంలో అవకాశాలు లేకపోవడంతో కేవలం బుల్లితెరపై జబర్దస్త్ యాంకర్‌గానే కొనసాగుతుంది ఈ ముద్దుగుమ్మ.అయితే రష్మి గౌతమ్ కు బెస్ట్ జోడి ఎవరు అంటే అందరు టక్కున చెప్పేస్తారు సుడిగాలి సుదీర్ అని.
ఎందుకంటే రష్మీ గౌతమ్ మరోవైపు సుడిగాలి సుదీర్ కు వీరి లవ్ ట్రాక్ వల్లనే క్రేజ్ వచ్చింది అన్న విషయం తెలిసిందే.ఇక వీరిద్దరూ ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకోవడానికి కెమెరాల ముందు చెప్పే డైలాగులు అందరినీ ఎంతగానో ఆకర్షించాయి.
దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుండు అని ఎంతో మంది కోరుకుంటున్నారు.ఇద్దరూ ఏదైనా షోలో ఉన్నారంటే ఆ షో తప్పకుండా హిట్ అయినట్లే అని నమ్మకం ఉంటుంది.
ఇలాంటి సమయంలో ఒక షాకింగ్ విషయం బయటకు వచ్చింది.యాంకర్ రష్మి గౌతమ్ కి పెళ్లి అయిపోయిందట.
రహస్యంగా పెళ్లి చేసుకున్న రష్మి గౌతమ్ ఏకంగా హైదరాబాద్‌లో కాపురం కూడా పెట్టేసిందట.
ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం రష్మీ గౌతమ్ తన భర్తతోనే హైదరాబాద్ లో కలిసి ఉంటుందని తెలుస్తోంది.సినిమా ఇండస్ట్రీ కి సంబంధం లేని వ్యక్తిని ఓ ప్రైవేట్ సంస్థ లో మేనేజర్ గా పని చేస్తున్న వ్యక్తిని ప్రేమించి పెళ్ళి చేసుకుందట.ఈ విషయం కాస్త వైరల్ గా మారి పోవడంతో ప్రస్తుతం అందరూ షాక్ అవుతున్నారు.
అయితే రష్మి గౌతమ్ పెళ్లి జరిగితే ఎందుకు ఇన్ని రోజులు రహస్యంగా ఉంచింది అన్న చర్చ కూడా మొదలైంది.యాంకర్ రవి కూడా పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టిన తర్వాత తన పెళ్లి గురించి అసలు విషయాన్ని బయట పెట్టి అందరికీ షాకిచ్చాడు.
జబర్దస్త్ యాంకర్ రష్మీ కూడా ఇలాంటిదే చేయబోతోందా అని అభిమానులు అనుకుంటున్నారట.అయితే ఇటీవల కాలంలో సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో బుల్లితేరకే పరిమితమైన రష్మి గౌతమ్ ఎక్కువ బుల్లితెర కార్యక్రమాల్లో కనిపిస్తోంది.ఇక తన తోటి యాంకర్ అనసూయ కూడా పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇంకా రాణిస్తోంది.మరి రష్మి గౌతమ్ పెళ్లి గురించి దాయాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నది మాత్రం చర్చించుకుంటున్నారు.
త్వరలోనే తన పెళ్లి విషయంపై రష్మి గౌతమ్ క్లారిటీ ఇస్తే బెటర్ అని అంటున్నారు అభిమానులు.ప్రస్తుతం రష్మి గౌతమ్ కు పెళ్లి జరిగిపోయింది అంటూ వస్తున్న వార్తలు నిజమేనా లేక ఇవన్నీ పుకార్లు మాత్రమేనా అన్నది క్లారిటీ ఇస్తే బాగుంటుందని లేదంటే మరిన్ని గాసిప్స్ పుట్టుకొచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు అభిమానులు.