తెలంగాణ అసెంబ్లీ( Telangana Assembly )లో ఇరిగేషన్ శ్వేతపత్రంపై చర్చ జరుగుతోంది.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ( Ponguleti Srinivasa Reddy )మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్( KCR ) అసెంబ్లీకి రావాలన్నారు.ప్రాజెక్టులన్నింటినీ తానే నిర్మించానని చెప్పుకున్న కేసీఆర్ లోపాలు బయటపడిన తరువాత కనిపించడం లేదని విమర్శించారు.

అలాగే గతంలో మేడిగడ్డను దేవాలయం పోల్చిన కేసీఆర్ ఇప్పుడు దాన్ని బొందలగడ్డ అని పేర్కొనడంపై ఆయనే ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.తొందరగా కట్టాలనే తపన తప్ప నాణ్యతపై దృష్టి పెట్టలేదని ఆరోపించారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బీఆర్ఎస్ కు లేదని స్పష్టం చేశారు.







