వచ్చే ఎన్నికల్లోను ఏపీలో వైసీపీ( YCP in AP ) జెండా ఎగిరే విధంగా ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు.గెలుపు పై పూర్తిగా ధీమాతో జగన్ ఉన్నారు.2019 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని హామీలను దాదాపు అమలు చేసామని , 99.5 శాతం హామీలను నెరవేర్చి సరికొత్త రికార్డు సృష్టించామని జగన్ పదేపదే చెబుతున్నారు.ప్రజలందరికీ సంక్షేమ పథకాల ద్వారా భారీగా జరిగింది అని , తప్పకుండా వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తారనే నమ్మకంతో జగన్ ఉన్నారు.ఎప్పటికప్పుడు ప్రజల నాడి తెలుసుకునేందుకు అనేక సర్వేలు చేస్తున్నారు.
ఇంకా ఏ ఏ విషయాల్లో ప్రజల్లో అసంతృప్తి ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఒకపక్క సర్వేలు , మరోపక్క ప్రశాంత్ కిషోర్ ( Prashant Kishore )కు చెందిన ఐ ప్యాక్ టీమ్ రంగంలోకి దిగి తాజా నివేదికలను జగన్ కు అందిస్తున్నాయి.
ఇక అభ్యర్థుల ఎంపికైన జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తారు అనుకున్న వారికి మాత్రమే టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలు, వైసిపి కీలక నాయకులు కీలక నాయకులు ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిస్తూ టికెట్ ప్రయత్నాలు చేస్తున్నా, సర్వే నివేదికల ఆధారంగానే టికెట్లను ప్రకటించేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.ఇక వచ్చే ఎన్నికల్లో ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సరికొత్తగా నవరత్నాలను రూపొందించాలని నిర్ణయించుకున్నారు.

వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు మేనిఫెస్టోనే కీలకం కాబోతుండడంతో, జగన్ మళ్ళీ సంక్షేమ పథకాల పైనే పూర్తిగా దృష్టి సారించారు.వీలైనంత ఎక్కువమందికి లాభం చేకూర్చే విధంగా పథకాలను రూపొందించాలని, ఆ పథకాల ద్వారానే మళ్లీ వైసీపీ( YCP ) విజయానికి డొఖా లేకుండా చేసుకోవాలనే లక్ష్యంతో జగన్ ఉన్నారు.అందుకే కొత్త మేనిఫెస్టోను తయారు చేసేందుకు కీలక నాయకులు, సీనియర్ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ, సరికొత్త నవరత్నాలను తీసుకొచ్చి విధంగా జగన్ కసరత్తు చేస్తున్నారు.

ముఖ్యంగా 2024 ఎన్నికల్లో గెలిచేందుకు కొన్ని ప్రధాన సామాజిక వర్గాలు కీలకంగా కావడం తో వారిపైనే ఎక్కువగా దృష్టి సాధించారు.అలాగే రైతులతో పాటు, ప్రభుత్వ సాయం పొందుతున్న పెన్షనర్లకు అదనపు ప్రయోజనాలు ప్రకటించే విధంగా సిద్ధం అవుతున్నారు.ఈ కొత్త మేనిఫెస్టో కోసం ఏర్పాటైన కమిటీ వచ్చే నెల నుంచి పూర్తిస్థాయిలో రంగంలోకి దిగబోతున్నట్లు వైసిపి వర్గాలు పేర్కొంటున్నాయి.
వచ్చే ఎన్నికల్లో టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉన్నా, తమ విజయానికి ఎటువంటి డోఖా లేదు అనే నమ్మకంతో జగన్ ఉన్నారు.







