Traffic Police : స్కూటీ నడుపుతూ ట్రాఫిక్ పోలీస్‌కి దొరికిపోయిన 13 ఏళ్ల బాలుడు.. రియాక్షన్ చూస్తే..

భారతదేశంలో మోటారు వాహనాన్ని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్( Driving license ) అవసరం, అలానే డ్రైవర్‌ లేదా రైడర్‌కు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి.అయితే కొంతమంది మైనర్లు చట్టాన్ని ఉల్లంఘించి రోడ్లపై వెహికల్స్ వేసుకొని వస్తుంటారు.

 A 13 Year Old Boy Who Was Caught By The Traffic Police Driving A Scooty If You-TeluguStop.com

హెల్మెట్ లేకుండా లేదా పెద్దల పర్యవేక్షణ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపేస్తుంటారు.

తాజాగా 13 ఏళ్ల బాలుడు బీజీ రోడ్డుపై స్కూటర్ నడుపుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.ఈ వీడియోలో ఒక ట్రాఫిక్ పోలీసు( Traffic Police ) అతన్ని ఆపి తన స్కూటర్ పార్క్ చేయమని అడిగాడు.తన తల్లిదండ్రులకు ఫోన్ చేయమని కూడా కోరాడు.

ఆ బాలుడు తన తండ్రికి ఫోన్ చేయడానికి పోలీసును ఫోన్ అడిగాడు.స్కూటర్ ఎందుకు నడుపుతున్నావు అని పోలీసు మర్యాదపూర్వకంగా అడిగాడు.

ఇకపై అలా చేయనని ఆ కుర్రాడు చెప్పాడు.

చట్టాన్ని ఉల్లంఘించినందుకు తన తండ్రికి ఫోన్ చేసి జరిమానా వేస్తానని పోలీసు చెప్పాడు.ఆ కుర్రాడు ఏ మాత్రం కంగారు పడలేదు, చూయింగ్ గమ్ నమలుతూనే ఉన్నాడు.ఆన్‌లైన్‌లో చాలా మంది అతని వైఖరిని ఎగతాళి చేశారు.“చూయింగ్ గమ్ వేరే లెవెల్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది!!” అని ఒకరు కామెంట్ చేసారు.చలాన్ కంటే చూయింగ్ గమ్ ముఖ్యం అని మరో వ్యక్తి సరదాగా వ్యాఖ్యానించాడు.ఈ బాలుడు అచ్చం కూడా భయపడకుండా పోలీసును లెక్క చేయని వైఖరిని చూసి మరి కొంతమంది నవ్వుకున్నారు.“అతని తండ్రి రాజకీయవేత్త ఏమో.” అని ఇంకొందరు అనుమానం వ్యక్తం చేశారు.ఈ వీడియోను ట్రాఫిక్ పోలీసు అధికారి వివేకానంద్ తివారీ( Vivekanand Tiwari ) ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

దీనికి 16 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి.జనవరిలో బెంగళూరు సిటీలో ఓ మైనర్ కారు నడుపుతున్న వీడియో వైరల్ అయింది.

ఇంకా చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలను ఇస్తూ వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube