టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, బాలీవుడ్ సహా అన్ని సినిమా ఇండస్ట్రీలలో ప్రతిష్టాత్మక సినిమా అవార్డు ఉంటాయి.తెలుగు సినిమా ఇండస్ట్రీలో నంది అవార్డ్స్ అత్యంత ముఖ్యమైనవి.1977 నుంచి ఈ అవార్డుల ప్రదానం కొనసాగుతోంది.దాదాపు 40 సంవత్సరాలుగా ఈ అవార్డులు అందజేస్తున్నారు.2017 నుంచి ఈ అవార్డుల ప్రదానంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ప్రతిష్టాత్మక నంది అవార్డును 1977లో తొలిసారి బెస్ట్ యాక్టర్ అవార్డ్ ను రెబల్ స్టార్ కృష్ణంరాజు దక్కించుకున్నారు.అమరదీపం సినిమాలో నటనకు గాను ఆయన ఈ అవార్డు గెల్చుకున్నారు.2016లో చివరి సారిగా జూ.ఎన్టీఆర్ 2016 నందిని దక్కించుకున్నాడు.నాన్నకు ప్రేమతో సినిమాలో నటనకి గాను ఆయన ఈ అవార్డు అందుకున్నారు.ఇప్పటి వరకు బెస్ట్ హీరోగా అవార్డులు పొందిన నటులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం!
వెంకటేష్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎక్కువ సార్లు బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డ్స్ అందుకున్న వ్యక్తి విక్టరీ వెంకటేష్.మొత్తం ఐదు సార్లు ఆయన ఈ పురస్కారం అదుకున్నారు.ప్రేమ, ధర్మచక్రం, గణేష్, కలిసుందాం రా, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అనే సినిమాలకు గాను ఆయన ఈ అవార్డులు పొందాడు.
మహేష్ బాబు
మహేష్ బాబు నాలుగు సార్లు బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ దక్కించుకున్నాడు.నిజం, అతడు, దూకుడు, శ్రీమంతుడు సినిమాలల్లో నటనకు ఆయన ఈ నందులు పొందాడు.
చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి మూడు సార్లు నంది అవార్డులు పొందాడు.స్వయం కృషి, ఆపద్భాంధవుడు, ఇంద్ర సినిమాలకు గాను ఆయన ఈ అవార్డులు పొందాడు.
బాలకృష్ణ
నందమూరి నటసింహం బాలకృష్ణ 3 సార్లు నంది అవార్డు తీసుకున్నాడు.నరసింహ నాయుడు, సింహ, లెజెండ్ సినిమాలకు గాను ఆయనకు ఈ గౌరవం దక్కింది.
నాగార్జున
అక్కినేని నాగార్జున కూడా 3 సార్లు నంది బహుమతులు పొందాడు.అన్నమయ్య , సంతోషం, శ్రీరామ దాసు చిత్రాలకు ఆయక ఈ పురస్కారాలు తీసుకున్నాడు.
కమల్ హాసన్
విశ్వనటుడు కమల్ హాసన్ సైతం మూడు సార్లు అవార్డులు పొందాడు .సాగర సంగమం, స్వాతిముత్యం, ఇంద్రుడు చంద్రుడు సినిమాల్లో నటనకు ఆయన ఈ బహుమతులు తీసుకున్నాడు.
జగపతి బాబు
ఈయన 3 సార్లు అవార్డులు పొందాడు.గాయం, మామి చిగురు, మనోహరం సినిమాలకు ఈ నందులు పొందాడు.
ఏఎన్నార్.
మేఘసందేశం , బంగారు కుటుంబం సినిమాలకు రెండు నందులు పొందాడు.కృష్ణంరాజు అమర దీపం , బొబ్బిలి బ్రాహ్మన్న సినిమాలకు ఈ అవార్డులు తీసుకున్నాడు.
దాసరి నారాయణ రావు మామ గారు , మేస్త్రీ సినిమాలకు ఈ అవార్డులు పొందాడు.రాజేంద్రప్రసాద్ ఎర్రమందారం , ఆ నలుగురు సినిమాలకు ఈ ప్రతిష్టాత్మక బహుమతులు స్వీకరించాడు.
జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, ప్రభాస్ మిర్చి, సుమన్ బావ బావమర్ధి , రవితేజ నేనింతే , నాని ఏటో వెళ్ళిపోయింది మనసు సినిమాల్లోని నటనకు గాను నందులు అందుకున్నారు.