తనికెళ్ళ భరణి మామూలోడు కాదుగా..! ఆ హీరోయిన్ తో అంత ప్రేమాయణం నడిపాడా!

నటుడిగా ,రచయితగా మరియు ఒక గొప్ప దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అతి తక్కువ మంది లెజెండ్స్ లో ఒకరు తనికెళ్ళ భరణి( Tanikela Bharani ).

ఈయన చెయ్యలేని పాత్ర అంటూ ఏది లేదు, భయంకరమైన విలనిజం పండించగలడు, అలాగే కామెడీ మరియు సెంటిమెంట్ ని కూడా అదే రేంజ్ లో పండించగలడు.

వంశీ దర్శకత్వం లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన 'లేడీస్ టైలర్'( Ladies Tailor ) అనే సినిమా ద్వారా పోలీస్ ఆఫీసర్ పాత్ర ద్వారా వెండితెర అరంగేట్రం చేసాడు.

మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి రచయితా కూడా ఆయనే.నటించే ఆసక్తి లేకపోయినా డైరెక్టర్ వంశీ చొరవ తీసుకొని బ్రతిమిలాడడం తో ఒక చిన్న పాత్ర చేసాడు.

ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది, ఆ తర్వాత రెండేళ్లు నటనకి దూరంగా కేవలం రచయితగానే ఆయన కొనసాగాడు, కానీ కళామ్మ తల్లి ఆయనని కేవలం రచయితగా మాత్రమే పరిమితం చెయ్యలేదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఒక బహుమతి లాంటి వాడివి , నువ్వు నటించాల్సిందే అని రామ్ గోపాల్ వర్మ రూపం లో చెప్పింది.

"""/" / ఆయన దర్శకత్వం వహించిన 'శివ' ( Shiva )చిత్రానికి తనికెళ్ళ భరణి కథ మరియు మాటలు అందించాడు, ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం తో తనికెళ్ళ భరణి జాతకమే మారిపోయింది, వరుసగా క్రేజీ సినిమాల్లో ఆఫర్స్ సంపాదిస్తూ అనతి కాలం లోనే స్టార్ క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎదిగిపోయాడు.

అలా శివ సినిమాతో ప్రారంభమైన తనికెళ్ళ భరణి సినీ కెరీర్, ఇప్పటికే ఎంతో అద్భుతంగా కొనసాగుతూనే ఉంది.

తనికెళ్ళ భరణి ఏడాదికి కనీసం 10 సినిమాల్లో నటించాల్సిందే, ఆయనకీ ఉన్న డిమాండ్ అలాంటిది మరి.

గత ఏడాది కూడా ఆయన 10 సినిమాల్లో నటించాడు, ఈయనతో పాటుగా కెరీర్ ని ప్రారంభించిన ఎంతో మంది క్యారక్టర్ ఆర్టిస్ట్స్ కి ఇప్పుడు డిమాండ్ బాగా తగ్గిపోయి ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నారు.

కానీ తనికెళ్ళ భరణి మాత్రం , నేటి తరం క్యారక్టర్ ఆర్టిస్టులకు కూడా పోటీని ఇస్తున్నాడంటే ఆయన రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

"""/" / ఇది ఇలా ఉండగా తనికెళ్ళ భరణి గతం లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చేసిన కొన్ని కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి.

ఆయన ఇంటర్వ్యూస్( Interviews ) అన్నీ కూడా చాలా సరదాగా ఉంటాయి, మనసులో ఏది ఉంచుకోకుండా అడిగిన ప్రశ్నలకు ఎలాంటి దాపరికం లేకుండా చెప్పేస్తుంటాడు.

అలా ఆయన సినిమాలు చేస్తున్న రోజుల్లో బాలీవుడ్ హీరోయిన్ రేఖ( Heroine Rekha ) అంటే ఆయనకీ ఎంతో పిచ్చి అట.

సినిమా ఇండస్ట్రీ లో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నప్పటికీ రేఖ ని చూస్తే నాలో కలిగిన ఫీలింగ్స్ వేరే ఏ హీరోయిన్ ని చూసినప్పుడు కూడా కలుగలేదని చెప్పుకొచ్చాడు.

అలా ఆయన ఆమె తో ఇప్పటీకీ వన్ సైడ్ లవ్ కొనసాగిస్తూనే ఉన్నాడట.

ఇప్పటీకీ తన పుస్తక ఆవిష్కరణకి ఆమెని ముఖ్య అతిథిగా పిలవాలని నాకు తెలిసిన వాళ్ళ చేత ప్రయత్నం చేస్తూనే ఉన్నానని, కానీ కుదరడం లేదని తనికెళ్ళ భరణి చెప్పుకొచ్చాడు.

బాలయ్య ఈ 7 ఏళ్ల లో ఆ ఒక్క సినిమా విషయం లోనే డేరింగ్ డిసిజన్ తీసుకున్నాడా..?