నాగబాబుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కమెడియన్.. ఏమనుకుంటున్నావ్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్?

మెగా బ్రదర్ నాగబాబు నటుడిగా నిర్మాతగా వెండి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.అయితే ఈయన వెండి తెరపై పెద్దగా విజయాలను సాధించలేకపోవడంతో ఈయన దృష్టి మొత్తం బుల్లితెరపై పెట్టారు.

 The Comedian Gave A Serious Warning To Nagababu By Saying What Do You Think , ,-TeluguStop.com

ఈ విధంగా బుల్లితెరపై ఎన్నో టీవీ సీరియల్స్ నిర్మించడమే కాకుండా టీవీ సీరియల్స్ లో నటించారు.అలాగే ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగబాబు ప్రస్తుతం ఆ కార్యక్రమం నుంచి బయటకు వచ్చి స్టార్ మాలో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ అనే కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇకపోతే స్టార్ మాలో పార్టీ చేద్దాం పుష్ప అనే స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమానికి సుడిగాలి సుదీర్ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.గత ఆదివారం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ఎపిసోడ్ పూర్తికాగా తర్వాత ఎపిసోడ్ ఈ ఆదివారం ప్రసారం చేయనున్నారు.

ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.ఈ ప్రోమోలో భాగంగా ప్రముఖ కమెడియన్ ముక్కు అవినాష్ ఏకంగా మెగా బ్రదర్ నాగబాబుకి సీరియస్ వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది.

ముక్కు అవినాష్ స్కిట్ లో భాగంగా ముక్కు అవినాష్ కొడుకు కలలో తన తండ్రి నాగబాబుకు వార్నింగ్ ఇచ్చినట్లు చెబుతాడు.దీంతో ముక్కు అవినాష్ సైతం తన కొడుకు కోసం ఏకంగా నాగబాబుకు వార్నింగ్ ఇచ్చారు.ఈ క్రమంలోనే నాగబాబు దగ్గరకు అవినాష్ వెళ్తూ.మిస్టర్ నాగబాబు ఏమనుకుంటున్నావ్ నువ్వు.ఆ లుక్ ఏంటీ? ఇది కరెక్ట్ కాదు.అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఇలా నాగబాబుకు అవినాష్ వార్నింగ్ ఇస్తున్న సమయంలో అక్కడున్న వారందరూ ఎంతో ఆందోళన చెందుతూ తర్వాత ఏం జరుగుతుందని ఎదురుచూస్తున్నారు.ఈ విధంగా అవినాష్ ఇది కరెక్ట్ కాదు అంటూనే తన కాళ్లపై పడి ఇది కరెక్ట్ అంటూ కామెడీ చేశారు.

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube