సినీ ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నటువంటి వారిలో నటి రష్మిక మందన్న( Rashmika Mandanna ) ఒకరు.ప్రస్తుతం ఈమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందారు.
ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలలోను అలాగే బాలీవుడ్ చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.ఇకపోతే ఇటీవల కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో పాత జ్ఞాపకాల అన్నింటిని మదిలో దాచుకుంటూ కొత్త సంవత్సరానికి కొత్త ఆశలతో స్వాగతం పలికారు.
ఈ క్రమంలోనే నటి రష్మిక మందన్న సైతం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం నేను ఇలా నేషనల్ క్రష్ గా మారాను అంటే అందుకు కారణం నేను నటించిన మొదటి సినిమా కిరిక్ పార్టీ( Kirik Party ) అంటూ ఈమె తన మొదటి సినిమాని గుర్తు చేసుకున్నారు.కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడు రక్షిత్ శెట్టి( Rakshith Shetty ) హీరోగా రష్మిక హీరోయిన్గా నటించిన ఈ సినిమా 2016 డిసెంబర్ 30వ తేదీ విడుదల అయింది.
2016 డిసెంబర్ 30వ తేదీని నా జీవితంలో మర్చిపోలేను ఆరోజు నా మొదటి సినిమా కిరిక్ పార్టీ విడుదల అయ్యి మంచి సక్సెస్ అందుకుంది .ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో నాకు తెలుగులో ఛలో సినిమాలో అవకాశం వచ్చిందని అలా తెలుగులో వరుస అవకాశాలు వచ్చి నేడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా నేషనల్ క్రష్ అనే పేరు ప్రఖ్యాతలను కూడా సొంతం చేసుకోగలిగాను.అందుకే ఈ సినిమా విడుదల తేదీ నాకు ఎప్పటికీ ప్రత్యేకమేనని ఈ సినిమా నా జీవితాన్ని కీలక మలుపు తిప్పింది అంటూ రష్మిక చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.