రెగ్యుల‌ర్ గా కాఫీ తాగ‌డం మంచిదేనా..?

ప్ర‌పంచవ్యాప్తంగా అత్య‌ధికంగా సేవించే పానీయాల్లో కాఫీ( Coffee ) ఒక‌టి.చాలా మంది లైఫ్ లో కాఫీ అనేది ప్ర‌ధాన పానీయంగా మారిపోయింది.

 Is It Good To Drink Coffee Regularly Details, Coffee, Drinking Coffee, Coffee Si-TeluguStop.com

కొంద‌రైతే కాఫీని ఒక ఎమోష‌న్ గా భావిస్తుంటారు.కాఫీతోనే త‌న రోజును ప్రారంభిస్తుంటారు.

అయితే రెగ్యుల‌ర్ గా కాఫీ తాగ‌డం మంచిదేనా? అంటే అది వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులు, కాఫీ తాగే పరిమాణం, మరియు శరీరంలోని ప్రతిస్పందనపై ఆధారపడి ఉంటుంది.

స‌రైన పరిమాణంలో కాఫీ తాగితే.

అది గుండె జ‌బ్బులు, లివర్ వ్యాధులు మరియు మధుమేహం వంటి సమస్యల ముప్పును తగ్గిస్తుంద‌ని పలు అధ్య‌య‌నాల్లో తేలింది.అలాగే కాఫీలో కెఫిన్( Caffeine ) ఉంటుంది.

కెఫిన్ ను ప‌రిమితంగా తీసుకుంటే అది మ‌న మేధస్సును ఉత్సాహపరుస్తుంది, దృష్టి మెరుగుపరుస్తుంది.మానసిక అవగాహనను పెంచుతుంది.

మ‌రియు ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని( Memory Power ) రెట్టింపు చేస్తుంది.

Telugu Acidity, Caffeine, Coffee, Coffee Benefits, Coffee Effects, Tips, Latest,

యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండ‌టం వ‌ల్ల కాఫీ శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.కొన్ని పరిశోధనల ప్రకారం రెగ్యుల‌ర్ గా కాఫీ తీసుకోవ‌డం వ‌ల్ల టైప్ 2 మధుమేహం( Type-2 Diabetes ) వచ్చే అవకాశాన్ని తగ్గించవచ్చట‌.కాఫీ మెటబాలిజం రేటును పెంచి కొవ్వు కరుగుదలలోనూ సహాయపడుతుంది.

అయితే మంచ‌ద‌న్నారు క‌దా అని కాఫీని అధికంగా తీసుకుంటే లేనిపోని స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

Telugu Acidity, Caffeine, Coffee, Coffee Benefits, Coffee Effects, Tips, Latest,

రోజుకి రెండు నుంచి మూడు కప్పులు కంటే ఎక్కువ కాఫీ తాగడం వ‌ల్ల నిద్రలేమి, ఆందోళన మరియు గుండె వేగం పెరగడం వంటి సమస్యలు ఇబ్బంది పెడ‌తాయి.కాఫీ ఎక్కువగా తాగితే కొంత మందిలో అసిడిటీ, జీర్ణ సమస్యలు త‌లెత్త‌వ‌చ్చు.అలాంటి వారు కాఫీని ఎవైడ్ చేయ‌డ‌మే మంచిది.

అలాగే హృదయ సంబంధిత సమస్యలు ఉన్నవారు, అధిక ర‌క్త‌పోటు ఉన్న‌వారు, నిద్రలేమితో బాధ‌ప‌డుతున్న వారు కాఫీని దూరం పెట్టాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.గర్భిణులు కూడా కాఫీని ఎవైడ్ చేయాలి.

ఎందుకంటే, గర్భిణులు కాఫీ తాగ‌డం వ‌ల్ల అందులోని కెఫిన్ గర్భాశయంలో పెరుగుతున్న బిడ్డపై ప్రభావం చూపవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube