టీతో పొర‌పాటున‌ కూడా తిన‌కూడ‌ని ఫుడ్స్‌ ఇవే!

టీ దీని గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.సామాన్యుడి నుంచి అసామాన్యుడి వ‌ర‌కు అంద‌రికీ అందుబాటులో ఉండే టీ ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధికంగా సేవించే పానియాల్లో ఒక‌టి.

 These Food Items Should Never Combine With Tea! Food Items, Tea, Benefits Of Tea-TeluguStop.com

మితంగా తీసుకుంటే టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని ఎంద‌రో నిపుణులు తేల్చి చెప్పారు.ఒత్తిడి, సీర‌సం, అల‌స‌ట‌, మ‌ధుమేహం, క్యాన్సర్ ఇలా ఎన్నో జ‌బ్బుల నుంచి ర‌క్షించ‌డంలో టీ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

అయితే టీ ఆరోగ్యానికి ఎంత మేలు చేసిన‌ప్ప‌టికీ దాన్ని తీసుకునే విధానంలో ప‌లు పొర‌పాట్లు చేసి తిప్ప‌లు తెచ్చుకుంటుంటారు.

ముఖ్యంగా టీతో కొన్ని కొన్ని ఆహారాలు అస్స‌లు తీసుకోరాదు.

అవేంటో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.పకోడి, టీ కాంబినేష‌న్ ఎంద‌రికో ఫెవ‌రెట్‌.

అందుకే చాలా మంది టీ తాగుతూ ప‌కోడీలు తింటుంటారు.కానీ, టీ తాగేట‌ప్పుడు ఇలా శెన‌గ‌పిండితో త‌యారు చేసిన ప‌కోడీలు తింట గ్యాస్‌, ఎసిడిటీ వంటి జీర్ణ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

అలాగే పోష‌కాలు గ్ర‌హించే శ‌క్తి కూడా స‌న్న‌గిల్లుతుంది.,/br.

Telugu Benefits Tea, Effects Tea, Items, Tips, Latest-Telugu Health - తెల

టీ తాగ‌డానికి లేదా టీ తాగిన వెంట‌నే పొర‌పాటు కూడా ప‌సుపు క‌లిపిన ఆహారాలు తీసుకోరాదు. టీ, ప‌సుపు ఒకే సారి తీసుకోవ‌డం వ‌ల్ల యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట‌ వంటి సమస్యలు వస్తుంటాయి.

టీ తాగిన వెంట‌నే కూల్ డ్రింక్స్ లేదా ఇత‌ర చ‌ల్ల‌ని పానియాలు తెలిసో, తెలియ‌కో తీసుకుంటారు.కానీ, ఇలా ఎప్పుడూ చేయ‌రాదు.టీ తాగిన వెంట‌నే ఇటువంటి చ‌ల్ల‌టి పానియాలు తీసుకోవ‌డం వ‌ల్ల దంత స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి.

Telugu Benefits Tea, Effects Tea, Items, Tips, Latest-Telugu Health - తెల

అలాగే టీతో పాటుగా ఐర‌న్ ఫుడ్స్ ఎప్పుడూ తీసుకోరాదు. ద్రాక్ష‌, జీడిప‌ప్పు, పిస్తా, క‌ర్జూరాలు, మాంసం, చేప‌లు, గుడ్లు, తృణ‌ధాన్యాలు, డార్క్ చాక్లెట్‌, పప్పు దినుసులు ఇలాంటి వాటిలో ఐర‌న్ అత్య‌ధికంగా ఉంటుంది.కాబ‌ట్టి, టీ తీసుకునే స‌మ‌యంలో ఈ ఆహారాల‌కు దూరంగా ఉంటే మంచిది.

లేదంటే అనేక స‌మ‌స్య‌లను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube