ప్ర‌స‌వం త‌ర్వాత జాజికాయను ఇలా తీసుకుంటే సూప‌ర్ ఫాస్ట్‌గా బ‌రువు త‌గ్గుతార‌ట‌!

సాధార‌ణంగా ప్ర‌స‌వం త‌ర్వాత దాదాపు మ‌హిళ‌లంద‌రూ వెయిట్ లాస్ అయ్యేందుకు తెగ ఆరాట‌ప‌డుతుంటారు.ఇందులో భాగంగానే ఎన్నో ప్ర‌య‌త్నాలు, ప్ర‌యోగాలు చేస్తుంటారు.

 Nutmeg Helps To Lose Weight After Delivery! Nutmeg, Lose Weight, Delivery, After-TeluguStop.com

అయితే ప్ర‌స‌వం త‌ర్వాత వ‌చ్చిన ఒళ్లును, జారిన పొట్ట‌ను, పెరిగిన న‌డుమును మ‌ళ్లీ పూర్వ స్థితికి తెచ్చేందుకు జాజికాయ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.వంట‌ల‌కు చ‌క్క‌టి రుచి, వాస‌న‌ను అందించే జాజికాయ‌లో ఎన్నో పోష‌క విలువ‌ల‌తో పాటు ఔష‌ధ గుణాలు నిండి ఉన్నాయి.

అందుకే ఆరోగ్య ప‌రంగా మ‌రియు సౌంద‌ర్య ప‌రంగా జాజికాయ అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.వివిధ ర‌కాల జ‌బ్బుల‌ను నివారిస్తుంది.ముఖ్యంగా ప్ర‌స‌వం త‌ర్వాత ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా జాజికాయ‌ను తీసుకుంటే సూప‌ర్ ఫాస్ట్‌గా బ‌రువు త‌గ్గొచ్చు.మ‌రి ఆల‌స్య‌మెందుకు డెలివరీ త‌ర్వాత జాజికాయ‌ను ఎలా తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారో ఓ చూపు చూసేయండి.

ముందుగా ఐదు నుంచి ఎనిమిది జాజికాయ‌ల‌ను తీసుకుని లైట్‌గా క్ర‌ష్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో క్ర‌ష్ చేసుకున్న జాజి కాయ‌ల‌ను వేసి స్లో ఫ్లేమ్‌పై రెండంటే రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.వేయించుకున్న జాజి కాయ ముక్క‌ల‌ను చ‌ల్లార బెట్టి..ఆపై మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా పొడి చేసుకోవాలి.

ఇక ఈ పొడిని అర స్పూన్ చ‌ప్పున గ్లాస్ గోరు వెచ్చ‌ని ఆవు పాల‌ల్లో క‌లిపి బ్రేక్ ఫాస్ట్ స‌మ‌యంలో తాగాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే గ‌నుక శ‌రీరంలో పేరుకు పోయిన కొవ్వంతా క్ర‌మంగా క‌రిగి పోయి శ‌రీరం మొత్తం మ‌ళ్లీ నాజూగ్గా త‌యారు అవుతుంది.

అంతే కాదు, జాజికాయ‌ను ఈ విధంగా తీసుకుంటే చ‌ర్మ సౌంద‌ర్యం పెరుగుతుంది.గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

మ‌రియు నిద్ర కూడా బాగా ప‌డుతుంది.

Nutmeg Helps To Lose Weight After Delivery! Nutmeg, Lose Weight, Delivery, After Delivery, Latest News, Health, Health Tips, Good Health, Weight Loss, Weight Loss Tips, - Telugu Delivery, Tips, Latest, Lose, Nutmeg

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube