టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు రాజకీయాల్లో యాక్టివ్ గా పాల్గొంటున్న విషయం తెలిసిందే.అయితే మొన్నటి వరకు రాజకీయాలలో ఫుల్ యాక్టివ్ గా పాల్గొన్న పవన్ ప్రస్తుతం సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టిని పెట్టాడు.
అంతేకాకుండా వచ్చే ఎన్నికలలో ఎలా అయినా గెలవాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పవన్.ఇకపోతే అప్పట్లో పవన్ కళ్యాణ్ నటించిన జానీ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో రేణు దేశాయ్ హీరోయిన్ గా నటించింది.కానీ ఈ సినిమా ఊహించని విధంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
పవన్ ఆ సినిమాలోని పాత్రలో సహజత్వం కోసం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే.2003 లో జాని విడుదల కాగా దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆయనకు మార్షల్ ఆర్ట్స్ అవసరం వచ్చింది.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమాలో ఆయన బందిపోటు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.అందులో భాగంగానే ఆయన హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తున్నారు.
హరి హర వీరమల్లు యాక్షన్ సీక్వెన్సెస్ కోసం పవన్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టారట.ఇదే విషయాన్ని తెలుపుతూ ట్విట్టర్ లో పవన్ డెంజరస్ మార్షల్ ఆర్ట్స్ ఫోజిచ్చారు.

రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నానంటూ కాప్షన్ ని కూడా రాసుకొచ్చారు.ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ విడుదల అవుతుండడంతో ఈ సినిమాపై మరింత పెరుగుతున్నాయి.క్రిష్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ఈ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే.