జుట్టు రోజురోజుకు పల్చబడుతుందా.. అయితే ఇది మీరు తెలుసుకోవాల్సిందే..!

జుట్టు విపరీతంగా రాలిపోతుందా.? ఎంత కేర్ తీసుకున్న కురులు రాలడం ఆగడం లేదా.

? రోజు రోజుకు జుట్టు పల్చగా మారిపోతుందా.‌.

? అయితే కచ్చితంగా మీరు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ గురించి తెలుసుకోవాల్సిందే.

ఈ రెమెడీ జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టడమే కాకుండా పల్చగా మారిన కురులను మళ్లీ దట్టంగా మార్చడంలో సహాయపడుతుంది.

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల మెంతులు( Fenugreek ) వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు ఒక కలబంద ఆకు తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ బాగా బాయిల్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax Seeds ) వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.

ఆపై అందులో నైట్ అంతా నానబెట్టుకున్న మెంతులు మరియు కలబంద ముక్కలు( Aloe Vera Pieces ) కూడా వేసి మరొక ఐదారు నిమిషాల పాటు ఉడికించాలి.

దాంతో వాటర్ అనేది జెల్లీ గా మారుతుంది. """/" / స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

పూర్తిగా కూల్ అయ్యాక ఈ జెల్ లో వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, అరకప్పు కొబ్బరి పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి. """/" / వారానికి ఒకసారి ఈ మాస్క్ ను కనుక వేసుకుంటే జుట్టు మూలాల నుంచి బలోపేతం అవుతుంది.

దాంతో జుట్టు రాలడం, విరగడం వంటి సమస్యలు తగ్గుతాయి.అలాగే ఈ మాస్క్ కొత్త జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.

ఊడిన జుట్టును మళ్ళీ మొలిపించి.కురులను ఒత్తుగా మారుస్తుంది.

అంతేకాకుండా ఈ మాస్క్ జుట్టులో తేమను నిలుపుతుంది.కురులకు కొత్త మెరుపును జోడిస్తుంది.

షైనీ గా మెరిసేలా చేస్తుంది.

Casino-Treueprogramme Bei Dafa Bet Casino: Ein Expertenguide Für Mobile Spieler