ఇక్కడ ఎవరిలో ఏ టాలెంట్ దాగి ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు.మనచుట్టూ తిరిగేవారిలో కొంతమంది అందగా పాడితే, మరికొంతమంది చాలా హృద్యంగా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించగలుగుతారు.
కొంతమంది డ్రాయింగ్ బాగా వేయగలిగితే మరికొంతమంది ఆటలు బాగా అడగలుగుతారు.ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో కళలు మనలో దాగి ఉంటాయి.
ఐతే ఈ ప్రపంచం ముందు ప్రదర్శించే అవకాశం ఏ కొద్దీ మందికో వస్తుంది.అయితే సోషల్ మీడియా వచ్చాక అది తేలికైందని చెప్పుకోవచ్చు.

చాలా మందికి తమలోని ప్రతిభను ప్రదర్శించడానికి ఇప్పుడు సోషల్ మీడియా( Social Media ) అనేది చక్కటి వేదికగా మారింది.ఇక దానికి సంబందించిన వీడియోలు చూసిన జనం లైకులు, షేర్లు చేయటం వల్ల కొందరు రాత్రి రాత్రికే ఫేమస్ అవుతున్న ఘటనలు మనం చూశాం, చూస్తున్నాం.ఈ క్రమంలోనే తాజాగా ఒక పోలీస్ అధికారి పాడిన పాట అందరినీ ఆకట్టుకుంటోంది.అతని గొంతులోంచి వచ్చిన రాగానికి ప్రజలు ఫిదా అవుతున్నారు అంటే నమ్మండి.కావాలంటే ఇక్కడ వీడియోని మీరు కూడా ఒకసారి చూడండి.

వీడియోలో….ఖాళీగా ఉన్న ఒక పార్కింగ్ స్థలంలో ఢిల్లీకి ( Delhi )చెందిన పోలీసు అధికారి అర్జిత్ సింగ్( Arijit Singh ) తన శ్రావ్యమైన స్వరంతో అద్భుతంగా పాడుతున్నాడు.లాల్ సింగ్ చద్దా అనే హిందీ సినిమాలోని తేరే హవాలే పాటని తనదైన రీతిలో చాలా అందంగా పాడాడు.
అర్జిత్ సింగ్ పాడిన ఈ పాటను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది.

ఆన్‌లైన్‌లో ఈ వీడియో మిలియన్ల మంది హృదయాలను కదిలించింది.ఈ వీడియోకి క్యాప్షన్‌గా మీ ప్రియమైన వారిని ట్యాగ్ చేయండి.అంటూ రాయడం చూడవచ్చు.
ఈ వీడియోను ఇప్పటికే 3 మిలియన్లకు పైగా వీక్షించారు.ఈ వీడియో చూస్తే మీరు కూడా ఫిదా అవుతారు.







