వైరల్: వధువు అందాన్ని చూసి కంగారుపడ్డ వరుడు.. ఏం చేశాడో తెలిస్తే అవాక్కవుతారు!

ఈమధ్య కాలంలో చూసుకుంటే ఎక్కువగా సోషల్ మీడియాలో వివాహానికి ( Wedding ) సంబంధించిన వీడియోలు వైరల్ కావడం మనం గమనించవచ్చు.మన భారతదేశంలో జరిగే పెళ్లి వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఇక్కడ ఏ స్థాయి వారైనా తమ వివాహ ఘట్టాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ఈ క్రమంలో అందమైన అనుభూతులను మూటకట్టుకుంటారు.స్నేహితుల, బంధువుల కోలాహలం… ఫన్నీ మూమెంట్స్, కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కలగలిపి వివాహం అనేది పరిపూర్ణత అవుతుంది.

 Strange Act By Groom Infront Of Bride Video Viral Details, Wedding, Viral News,-TeluguStop.com

దాంతో ఆయా ఘటనలకు సంబంధించినటువంటి వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో( Social Media ) ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి.ఎందుకంటే వాటిలో మనలో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు కాబట్టి.

నెటిజన్లు ఈ వీడియోలను ఎక్కువగా ఇష్టపడటానికి కారణం ఇదే.అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.కాగా ఆ వీడియోపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇక్కడ వీడియోలో వధూవరులు వేదికపై నిలబడి ఉండటం చూడొచ్చు.వీరిద్దరి మెడలో వరమాల( Garland ) కూడా కనిపిస్తుంది.అంటే వారికి పెళ్లి అయిపోయి రిసెప్షన్ కొరకు అలా ముస్తాబై ఉన్నట్టు కనబడుతోంది.

అయితే ఇంతలో, వరుడు చేసిన పనికి అక్కడున్న వారందరూ షాక్ అవుతారు.దానికి కారణం వధువు రెడ్ కలర్ లెహంగాలో అందంగా కనబడడమే.

మరి ఆ అందాన్ని చూసి వరుడు కాస్త చివుక్కుమని ఉంటాడు.అందుకని ఎక్కడ ఆమెపైన ఆహుతుల కళ్ళబడి దిష్టి తగులుతుందో అని తన చేతిలో ఉన్న నల్లటి దుప్పటతో ఆమెకు దిష్టి తీయటం మొదలు పెడతాడు.కాగా ఆమెపట్ల అతడు చూపిన ప్రేమకు ఆమెతోపాటు నెటిజన్లు కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube