Arvind Kejriwal : సిఏఏ అమలు చేయడంపై బీజేపీ పై కేజ్రీవాల్ సీరియస్ వ్యాఖ్యలు..!!

2019 ఎన్నికల అనంతరం తీసుకొచ్చిన సిఏఏ( CAA ).ఇప్పుడు ఎన్నికలకు ముందు కేంద్రం అమలులోకి తీసుకురావడం సంచలనం సృష్టించింది.

 Kejriwal Serious Comments On Bjp On Implementation Of Caa-TeluguStop.com

సిఏఏ విషయంలో కొన్నిచోట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.మత ప్రాతిపదికన మనుషులను గుర్తించడం దేశానికి క్షేమకరం కాదని చాలామంది నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదే సమయంలో కేరళ ముఖ్యమంత్రి విజయన్( Pinarayi Vijayan ) సిఏఏ తమ రాష్ట్రంలో అమలు చేయబోనిమ్మని వ్యాఖ్యానించారు.దేశంలో పౌరసత్వ సవరణ చట్టం తక్షణమే అమలులోకి తీసుకురావడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిల విమర్శలు వస్తున్నాయి.

విదేశాల నుంచి వచ్చిన అన్ని మతాలవారికి పౌరసత్వం కల్పించి ఒక్క ముస్లింలకు మాత్రమే పౌరసత్వం ఇవ్వకూడదని నిర్ణయించడంతో దేశంలో ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి.వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై తమిళనాడు “తమిళగా వెట్రి కలగం” పార్టీ చీఫ్ దళపతి విజయ్ కూడా వ్యతిరేకించడం జరిగింది.ఈ చట్టాన్ని తమిళనాడు రాష్ట్రంలో అమలు చేయవద్దని ప్రభుత్వానికి విజయ్( Vijay ) విజ్ఞప్తి చేశారు.ఇదిలా ఉంటే తాజాగా పౌరసత్వ సవరణ చట్టంపై ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ( Arvind Kejriwal )స్పందించారు.

పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీ డర్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని విమర్శించారు.సిఏఏ చట్టాన్ని రద్దు చేయాలని ప్రజలు కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై తీవ్రస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube