యాబైవేల మందితో రైతు ఉద్యమానికి సిద్ధమవుతున్న కేటీఆర్ ? 

గత కొంతకాలంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR )కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేక విషయాల్లో చుక్కలు చూపిస్తున్నారు.అనేక అంశాలపై ప్రశ్నిస్తూ.

 Ktr Preparing For The Farmers Movement With Thousands Of People-TeluguStop.com

  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు , మంత్రులకు సవాళ్లు సైతం విసురుతున్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మితమైన సాగునీటి ప్రాజెక్టులు విషయంలో కాంగ్రెస్ పై అనేక విమర్శలు చేస్తున్న నేపథ్యంలో,  వీటిపైన కేటీఆర్ స్పందిస్తున్నారు.

  తాజాగా కాలేశ్వరం ప్రాజెక్ట్ విషయంపై కేటీఆర్ స్పందించారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కాలేశ్వరం పర్యటన రెండో రోజు కొనసాగుతోంది.

ఈ సందర్భంగా కన్నేపల్లి పంపు హౌస్ ను కేటీఆర్ సందర్శించారు.ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించిన కేటీఆర్ అనేక అంశాలపై మాట్లాడారు.

ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత దేశ స్వతంత్ర చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా వేగంగా కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టును( Kaleshwaram project ) నిర్మించారని కేటీఆర్ అన్నారు తెలంగాణకు కల్పతరువు కాలేశ్వరం ప్రాజెక్టు అని అన్నారు.

Telugu Brs, Congress, Ktrfarmers, Telangana-Politics

తెలంగాణలో కరువు అనే మాట వినిపించకూడదని కేటీఆర్ ఈ ప్రాజెక్టును నిర్మించారని,  గతంలోనూ నీటి సమస్య ఉందని రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు.పంటల సాగు కోసం నీటిని ఇచ్చే పరిస్థితి ప్రస్తుతం లేదని కేటీఆర్ అన్నారు.ఎగువ నుంచి నీరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని , 17 టీఎంసీల సామర్థ్యంతో కొండపోచమ్మ సాగర్ నిర్మించామని అన్నారు.

  హైదరాబాద్ నీటి అవసరాల కోసం దీన్ని నిర్మించామని,  సాగు అవసరాల కోసం 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్న సాగర్ నిర్మించామన్నారు. 90 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎస్సారెస్పీలో కేవలం 25 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయని,  26 టీఎంసీలు ఉండాల్సిన ఎల్ఎండిలో కేవలం 5 టీఎంసీలు ఉన్నాయని , డెడ్ స్టోరేజీ మూడు టీఎంసీలు అన్నారు.25 టీఎంసీల మిడ్ మానేరులో కేవలం 5 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయని,  100 భాగాలు ఉన్న కాళేశ్వరంలో కేవలం మేడిగడ్డలో చిన్న లోపాన్ని భూతద్దంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు.

Telugu Brs, Congress, Ktrfarmers, Telangana-Politics

నీటి ఎద్దడి పరిస్థితులు ఉన్నా.మోటర్లు ఆన్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు ఈ ప్రాజెక్టులన్ని నిండు కుండలా ఉన్నాయని , పంపు హౌస్ లను నడిపితే రోజుకు రెండు టీఎంసీలు ఎత్తుపోయవచ్చని,  కానీ రాజకీయపరమైన నిర్ణయం లేకపోవడం వల్లే అధికారులు ఏమి చేయలేకపోతున్నారని కేటీఆర్ అన్నారు.

నీళ్లు ఎత్తిపోయకపోతే 50,000 మంది రైతులతో తామే వస్తామని , పంపులు మేమే ఆన్ చేసి రైతులకు నీళ్లు అందిస్తామని, అసెంబ్లీ ముగిసే వరకు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నామని కేటీఆర్ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube