సోషల్ మీడియాలో ప్రతిరోజు అనేక రకాలుగా సంబంధించిన వీడియోలు వైరల్ కావడం గమనిస్తూనే ఉంటాము.అయితే ఇందులో కంటెంట్ ఉన్న వీడియోలు మాత్రమే ఎక్కువగా వైరల్ అయితాయి.
అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా ఎక్కువగా చూస్తూనే ఉంటాము.తాజాగా సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీని లిఫ్ట్ ( Electric bike battery lift )లోకి తీసుకురాగా అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
వైరల్ గా మారిన వీడియోలో.ఒక వ్యక్తి తన ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన బ్యాటరీని తీసుకొని లిఫ్టులో తన ఇంటికి వెళ్లడానికి ప్రయత్నం చేశాడు.అతడు తన స్కూటీ సంబంధించిన బ్యాటరీని తీసుకొని లిఫ్టులోకి వెళ్లి పైకి వెళ్ళేందుకు తన ఫ్లోర్ సంబంధించిన బటన్ నొక్కాడు.
ఇక అంతే క్షణాల వివిధలో ఏమైందో ఏమో తెలియదు కానీ బ్యాటరీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.మొదటగా చిన్నగా మొదలైన ఆ మంటలు క్షణకాలంలో పెద్దవిగా మారి పేలుడు లాంటి సంఘటన జరిగింది.
ఆ సమయంలో లిఫ్టులో ఆ ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్నాడు.ఈ భయానికర సంఘటన నేపథ్యంలో వ్యక్తి బ్యాటరీ దెబ్బకు కాలి చనిపోయాడు.ఈ వీడియోని బట్టి చూస్తే.ఆ ఘటన చైనా ( China )దేశంలో జరిగినట్లుగా తెలుస్తోంది.
ఇకపోతే ఈ వీడియోని చూసిన నెటిజన్స్.అదేంటి చేత్తో పట్టుకున్న బ్యాటరీ అలా పేలిపోవడం ఏంటి అంటూ కొందరు ప్రశ్నిస్తుండగా.
మరికొందరు., బాబోయ్.
ఇలాంటి వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇలాంటి దారుణ సంఘటనలకు బలి అవ్వాల్సిందే అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇక లిఫ్ట్ లో ఘటన జరిగిన తర్వాత పై ఫ్లోర్లో ఉన్న ఓ వ్యక్తి ఆ సంఘటనను గ్రహించి అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ కి తెలపగా వారు లిఫ్ట్ ఆపరేటర్స్ ను పీల్చుకొని వచ్చి చివరికి లిఫ్టులో కాలిపోయి దుర్మరణం చెందిన వ్యక్తిని అతి కష్టం మీద బయటకు తీసుకోవచ్చారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ దారుణ సంఘటనకు సంబంధించిన వీడియోని ఒకసారి చూసేయండి.