ఒకప్పుడు సినిమాలలో హీరో హీరోయిన్లకు అక్కా చెల్లి పాత్రలలో మామూలు ఆర్టిస్టులు ఉండేవాళ్ళు.కానీ ఇప్పుడు సీనియర్ హీరో హీరోయిన్లు.
హీరోలకు అక్కగా, అన్నగా కనిపిస్తున్నారు.ఇప్పటికే గత కొంత కాలం నుండి వస్తున్న సినిమాలలో హీరోలకు ఒకప్పటి హీరోలు అన్నగా, హీరోయిన్లు చెల్లెల పాత్రలో కనిపించారు.
అయితే తాజాగా మహేష్ సినిమాలో కూడా ఆయనకు అక్కగా ఒక స్టార్ హీరోయిన్ నటించినుందని వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ లు అందుకొని స్టార్ హీరోగా ఎదిగాడు.
అంతేకాకుండా మంచి అభిమానాన్ని సంపాదించుకున్నాడు.ఇక మధ్యలో కొన్ని సినిమాలు నిరాశపరిచినప్పటికీ కూడా ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా మళ్లీ మంచి సక్సెస్ లు అందుకున్నాడు.
ఇక సర్కారు వారి పాట సినిమా తర్వాత వరుసగా పలు సినిమాలకు సైన్ చేశాడు.సర్కారు వారి పాట మంచి సక్సెస్ కావడంతో పలువురు దర్శకులు కూడా మహేష్ బాబు కోసం క్యూ కట్టారు.
అయితే మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram ) తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయనున్నాడు.

ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు మహేష్.ఇక ఈ సినిమాకు ఎటువంటి పేరు పెట్టకపోగా ప్రస్తుతం ఎస్ ఎస్ ఎం బి 28 అనే టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.ఇక ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్ పూర్తి చేసుకోగా మూడో షెడ్యూల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సినీ బృందం.అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక అప్డేట్ బాగా వైరల్ అవుతుంది.

అదేంటంటే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్( Kajol ) ను ఈ సినిమాలోకి తీసుకుంటున్నట్టు తెలిసింది.అయితే అది కూడా మహేష్ బాబుకు అక్క పాత్రలో కనిపించనుందని తెలుస్తుంది.ఇక ఈ విషయం తెలియటంతో మహేష్ బాబు అభిమానులు సంతోషంలో మునుగుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ మహేష్ బాబుకు అక్కగా నటించడం అంటే మామూలు విషయం కాదని అనుకుంటూ సినిమాపై భారీ అంచనాలు పెంచుకుంటున్నారు.

ఇక ఇది నిజమైతే కాజోల్ కు టాలీవుడ్ ( Tollywood )లో మరిన్ని అవకాశాలు రావడం గ్యారెంటీ అని తెలుస్తుంది.ఇక మహేష్ బాబు ఈ సినిమా పూర్తి అయిన వెంటనే కొంతకాలం బ్రేక్ తీసుకొని రాజమౌళి సినిమాలో అడుగుపెట్టనున్నాడు.రాజమౌళి కూడా మహేష్ బాబు కోసం కథ సిద్ధం చేసుకొని ఉన్నట్లు తెలుస్తుంది.ఇక ఈ రెండు సినిమాలు మహేష్ బాబును ఇంకెంత ఎత్తుకు తీసుకెళ్తాయో చూడాలి.







