అరికాళ్ల మంటలు.ఎందరినో వేధించే కామన్ సమస్య ఇది.అందులోనూ ముప్పై, నలబై ఏళ్లు దాటిన స్త్రీ, పురుషులు తరచూ అరికాళ్ల మంటలను ఫేస్ చేస్తూనే ఉంటారు.దీని కారణంగా రాత్రుళ్లు నిద్ర కూడా సరిగ్గా పట్టదు.
పాదాల్లో నాడులు దెబ్బ తినడం వల్ల ప్రధానంగా ఈ సమస్య ఇబ్బంది పెడుతుంది.అలాగే అధిక వేడి, పాదాలకు రక్తసరఫరా తగ్గడం, ఇన్ఫెక్షన్, పోషకాల కొరత వంటి కారణాల వల్లా అరికాళ్లు మంట పుడుతూ ఉంటాయి.
దాంతో ఈ సమస్య నుంచి బయట పడటం కోసం ఏం చేయాలో తెలియక హాస్పటల్స్ చుట్టూ తిరుగుతుంటారు.
అయితే ఇంట్లోనే అరికాళ్ల మంటల నుంచి ఉపశమనాన్ని పొందేందుకు సులభమైన మార్గాలు కొన్ని ఉన్నాయి.
అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బకెట్‌లో సగం వరకు నీటిని తీసుకుని.
అందులో మూడు టేబుల్ స్పూన్ల పటిక బెల్లం పొడి, వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి నైటంతా వదిలేయాలి.నెక్స్ట్ డే ఆ నోటిలో పాదాలను ఓ ఇరవై నిమిషాల పాటు ఉంచాలి.
ఇలా చేస్తే అరికాళ్ల మంటలు దూరం అవుతాయి.

అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని అరికాళ్లకు పట్టించి.ముప్పై నిమిషాల పాటు వదిలేయాలి.
ఆపై చల్లటి నీటితో పాదాలను క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల ముల్తానీ మట్టి, పెరుగు మరియు తేనెలో ఉండే పలు సుగుణాలు అరికాళ్ల మంటల నుంచి త్వరగా ఉపశమనాన్ని అందిస్తాయి.
ఇక ఈ చిట్కాలతో పాటు డైట్‌లో విటమిన్ బి12 పుష్కలంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి.మద్యం అలవాటును మానుకోవాలి.
మధుమేహం, థైరాయిడ్ వ్యాధులు ఉంటే.వాటిని అదుపులో ఉంచుకోవాలి.
తద్వారా అరికాళ్ల మంటల నుంచి మరింత త్వరగా బయటపడొచ్చు.