పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల “అపోన్ బంగ్లా” అనే కొత్త ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించింది.ఈ పోర్టల్ ప్రాథమిక లక్ష్యం ప్రవాసీ బెంగాలీలు, నాన్-రెసిడెంట్ భారతీయులు (NRIలు), భారతీయ మూలలు ఉన్న వ్యక్తులు (PIO), పశ్చిమ బెంగాల్‌కు చెందిన భారతీయ విదేశీ పౌరులు (OCI)లను కనెక్ట్ చేయడం.
వీరందరూ కొత్తగా లాంచ్ చేసిన https://aponbangla.wb.gov.in వెబ్‌సైట్ ద్వారా పోర్టల్ యాక్సెస్ చేయవచ్చు.
బంగ్లాదేశ్‌లో మాతృభాష కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పిస్తూ మంగళవారం నగరంలోని దేశప్రియ పార్కులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ పోర్టల్‌ను ప్రారంభించారు.పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎన్నారైలు, POIలు, OCIలకు అపోన్ బంగ్లా కార్డ్ ఇవ్వడం జరుగుతుంది.ఈ వ్యక్తులు కలిగి ఉన్న ఏవైనా ఫిర్యాదులను పరిష్కరించడానికి పోర్టల్ ఒక వేదికగా కూడా పనిచేస్తుంది.
ఈ పోర్టల్ లో యూజర్స్ తమ అభిప్రాయాలను, సూచనలను రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోగలరు.అలానే ప్లాట్‌ఫామ్‌లో “అలుమ్నీ కనెక్ట్” ఫీచర్ ఉంటుంది.దీని సహాయంతో యూజర్లు తమ పాత పాఠశాల, కళాశాల క్లాస్‌మేట్‌లతో కనెక్ట్ అవ్వచ్చు.
మరో మాటలో చెప్పాలంటే అపోన్ బంగ్లా అనేది పశ్చిమ బెంగాల్ వెలుపల నివసిస్తున్న బెంగాలీలలో కమ్యూనిటీ భావాన్ని పెంపొందించడానికి ఉద్దేశించిన ఒక వినూత్న కార్యక్రమం.ప్రజలు ఒకరితో ఒకరు, రాష్ట్ర ప్రభుత్వంతో కనెక్ట్ అవ్వడానికి ఒక వేదికను అందించడం ద్వారా, పోర్టల్ పశ్చిమ బెంగాల్ ఎన్నారైల మధ్య సంబంధాలను బలోపేతం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది.ప్రపంచవ్యాప్తంగా బెంగాలీ సమాజాన్ని నిర్మించడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు అని చెప్పవచ్చు.