హోలీ పండు( Holi )గ వస్తే చాలు భారత దేశంలో ప్రతి పల్లె, పట్టణం అంటూ తేడా లేకుండా ప్రతిచోట పిల్లలు పెద్దలు ముఖ్యంగా యువత రంగులతో ఆడుతూపాడుతూ ఎంజాయ్ చేస్తారు.మరికొందరైతే రంగులు పూసుకొని బైకులపై అడుచుకుంటూ రోడ్ల వెంబడి తెగ ఎంజాయ్ చేస్తుంటారు.
ఇకపోతే తాజాగా ఓ జంట మాత్రం హోలీ పండుగ నాడు ఓ స్టంట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని అనుకున్నారేమో తెలియదు కానీ.వారు చేసిన పని మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వీడియో సంబంధించి వివరాలు చూస్తే.

ఈ వీడియోలో ఓ యుకుడు బైక్ నడుపుతుండగా ఆ బైక్ వెనకాల ఓ అమ్మాయి స్టంట్ చేయబోయింది.కాకపోతే కథ అడ్డం తిరిగింది.ముందుగా బైక్ నడుపుతున్న వ్యక్తి వెనకాల నిలబడి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ఫోటోలు ఇవ్వాలి అనుకుంది.
ఫోటోలైతే పరవాలేదు.వీడియో కోసం బైక్ పై నిలబడి కాస్త సాహసమే చేసిందని చెప్పుకోవచ్చు.
ఆ అమ్మాయి బైక్ పై నిలబడ్డాక బైక్ నడుపుతున్న వ్యక్తి సడన్ గా బ్రేక్ వేయడంతో ఆమె ఒక్కసారిగా బైక్ పైన నుంచి కింద బొక్క బోర్లా పడింది.ఈ సంఘటన ఉత్తరప్రదేశ్( Uttar Pradesh ) లోని నోయిడాలో చోటు చేసుకుంది.

ఈ వీడియోను చూసిన నెటిజన్స్ కామెంట్స్ లో తెగ రెచ్చిపోయారు.అందులో ఒకరు ‘ అమ్మాయి నువ్వు అతి చేయొచ్చు.కానీ., దాన్ని మీరు హద్దులు మీరకుండా చేసుకుంటే బాగుంటుందంటూ’ అనగా.మరొకరు ‘అయ్యయ్యో.జాగ్రత్త’ అంటూ కామెంట్ చేస్తున్నారు.







