Eeli Nani : వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత..!!

ఏపీలో ఎన్నికల సమయం ఆసన్నమైంది.ఈ వారం లేకపోతే వచ్చే వారంలోనైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోంది.2024 ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయి.ఈ క్రమంలో ఒక పార్టీ నుండి మరొక పార్టీకి జంప్ అవుతున్న నాయకుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

 Former Mla Who Joined Ycp Is Tdp Leader-TeluguStop.com

ఈ రకంగానే తాడేపల్లిగూడెంకి చెందిన తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే ఈలి నాని వైసీపీలో జాయిన్ అయ్యారు.గురువారం వైయస్ జగన్ తాడేపల్లిలో ఈలి నానికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009 ఎన్నికలలో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ తరఫున తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా ఈలి నాని( Nani ) గెలిచారు.ఆ తర్వాత 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో వైసీపీ( YCP ) ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ గెలుపొందడం జరిగింది.అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఈలి నాని ఇప్పుడు ఎన్నికలకు ముందు వైసీపీలో జాయిన్ కావడం జరిగింది.

ఎన్నికల దగ్గర పడే కొలది ఒక పార్టీ నుండి మరొక పార్టీలో జాయిన్ అవుతున్న నాయకుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది.మరో నెల రోజుల్లో జరగబోయే ఎన్నికలలో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తది అన్నది ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube