వాడేసిన బట్టలు అమ్ముతూ రూ.లక్షలు సంపాదిస్తున్న యూకే మహిళ..??

ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి ఏదో ఒక మార్గాన్ని కనుగొంటారు, అది వ్యాపారం కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు.అయితే కొందరు మాత్రం వెరైటీ ఐడియాస్‌తో కష్టపడకుండానే లక్షలాది రూపాయలు సంపాదిస్తుంటారు యూకేకి చెందిన ఒక మహిళ కూడా ధనవంతురాలయ్యే ఒక మార్గాన్ని కనుగొంది.

 Uk Woman Earning Lakhs By Selling Used Clothes, Business, Hannah Bevington, Sell-TeluguStop.com

హన్నా బెవిన్‌టన్( Hannah Bevinton ) అని పిలిచే ఈ మహిళ వాడేసిన తన బట్టలు, బూట్లు, ఆభరణాలు అమ్మి డబ్బు సంపాదిస్తుంది.ఆమె వ్యాపారం చాలా విజయవంతంగా సాగుతోంది.

ఆమె మంచి ఆదాయాన్ని సంపాదిస్తుంది.ఇతరులకు కూడా సహాయపడేలా ఆమె కొన్ని వ్యాపార చిట్కాలను కూడా పంచుకుంది.

హన్నా “వింటెడ్”( vinted ) అనే ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లో తన బట్టలు, బూట్లు, జ్యువలరీ సేల్ చేస్తుంది.వింటెడ్‌ వెబ్‌సైట్‌లో పాత వస్తువులు లేదా సెకండ్ హ్యాండ్ వస్తువులను అమ్ముకోవచ్చు.

హన్నా ఈ ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌ను ఉపయోగించే వ్యక్తులలో ఒకరు.అమ్మే వస్తువులకు ఎలాంటి ఫీజు ఉండదు, కానీ కొనుగోలు చేసే వ్యక్తి నుంచి కొద్దిపాటి ఛార్జీ తీసుకుంటారు.

ఈ ప్లాట్‌ఫామ్ సహాయంతో, హన్నా తన పాత బట్టలు, బూట్లు, ఆభరణాలు వంటివి చాలా అమ్మింది.దీని ద్వారా ఆమె రూ.6,44,331 సంపాదించింది.

Telugu Sells Shoes, Uk Lakhs-Telugu NRI

సోషల్ మీడియాలో తన వ్యాపార చిట్కాల గురించి మాట్లాడుతూ, తగిన ధర పొందడానికి వస్తువు ధరను తగ్గించాల్సిన అవసరం లేదని హన్నా పేర్కొంది.తక్కువ ధరను కోట్ చేయడం వల్ల కొనుగోలుదారుడు అమ్మకందారుడికి డబ్బు అవసరం అని భావిస్తారు.ఒకేసారి కనీసం 100 వస్తువులను అమ్మకానికి పెట్టాలి, అదీ ఆదివారాలలో.

ఈ విధంగా, వారపు రోజుల్లో వస్తువులు అమ్ముకునే అవకాశం పెరుగుతుందని ఆమె చెప్పింది.

Telugu Sells Shoes, Uk Lakhs-Telugu NRI

ఆమె ప్రకారం, అమ్మకానికి సిద్ధంగా ఉన్న వస్తువుల ఫొటోలు స్పష్టంగా ఉండాలి.ప్రతి ఆఫర్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి.ఆఫర్లు 10-15% తక్కువ ధరలకు ఉండాలి.

ఈ విషయాలతో పాటు, అమ్మకందారుడు ప్యాకింగ్‌పై ఎక్కువ సమయం వృథా చేయకూడదు.ఈ ఆలోచనను చాలా మంది ప్రశంసించారు.

ఈ ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లో పాల్గొంటున్న అనేక మంది సెల్లార్స్‌కు ఇది సహాయకరంగా ఉంటుందని కూడా అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube