వారెవ్వా, అద్భుతంగా బ్యాక్‌ఫ్లిప్స్ చేస్తున్న పావురం.. వీడియో వైరల్..

సోషల్ మీడియాలో వైరలయ్యే యానిమల్ వీడియోలు జంతు ప్రేమికులతో సహా ప్రతి ఒక్కరినీ ఫిదా చేస్తుంటాయి.ఒక్కోసారి ఈ వీడియోలను చూస్తే మన కళ్లను మనమే నమ్మలేం.

 The Pigeon Doing Amazing Backflips Video Viral , Prisoners Dilemma Club, Pigeo-TeluguStop.com

ఎందుకంటే ఈ వీడియోల్లో జంతువులు ఎవరూ ఊహించని పనులు చేస్తాయి.అయితే తాజాగా ఒక పక్షి జిమ్నాస్టిక్స్‌లో ప్రొఫెషనల్స్ లాగా ఒక అదిరిపోయే స్టంట్ చేసి అందర్నీ అబ్బురపరుస్తోంది.

దీనికి సంబంధించిన వీడియోని ప్రిజనర్స్ డైలమా క్లబ్ అనే ట్విట్టర్ ఖాతా షేర్ చేసింది.ఇది ఇప్పటికే 5 లక్షల కంటే ఎక్కువ వ్యూస్, 2 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.

ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న వీడియోలో ఒక తెల్ల పావురాన్ని చూడొచ్చు.ఇది సినిమాల్లో స్టంట్ ఆర్టిస్ట్‌లవలె బ్యాక్‌ఫ్లిప్‌లు చేయడం కూడా మీరు గమనించవచ్చు.జిమ్నాస్టిక్స్‌లో బాగా అనుభవం ఉన్న వ్యక్తుల లాగా ఇది చాలా చక్కగా బ్యాక్‌ఫ్లిప్‌లు చేసింది.ఈ పక్షి ఒక్కసారి కాదు మూడుసార్లు పర్ఫెక్ట్ గా బ్యాక్‌ఫ్లిప్ చేసింది.

ఈ సమయంలో ఇది కొంచెం కూడా బ్యాలెన్స్ తప్పలేదు.ఇంత అద్భుతంగా బ్యాక్‌ఫ్లిప్‌లు చేసిన ఈ పక్షిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతారు.

వారెవ్వా, ఏం టాలెంట్ గురు అని నెటిజన్లు పావురాన్ని పొగుడుతున్నారు.“ఒక పావురం ఇలా ఎగురుతున్నప్పుడు చూడటం ఇదే తొలిసారి.పక్షుల్లో ఇలాంటి టాలెంట్ ఉండటం నిజంగా ఆశ్చర్యకరం” అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.అయితే ఒక యూజర్ మాత్రం దీనికి ఏదో ఒక జబ్బు ఉందని అందుకే అది బ్యాక్‌ఫ్లిప్స్ చేస్తోందని అభిప్రాయపడ్డాడు.

సాధారణంగా పక్షుల్లో కొన్ని మాత్రమే బ్యాక్‌ఫ్లిప్స్ చేస్తాయి.అది కూడా గాలిలోనే పల్టీలు కొడుతుంటాయి.

అయితే ఇది మాత్రం రెండు అడుగుల ఎత్తులోనే బ్యాక్‌ఫ్లిప్‌ చేసి ఆశ్చర్యపరిచింది.ఈ అమేజింగ్ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube