జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపడుతూ, నిరంతరం పార్టీ శ్రేణులు జనాల్లో ఉండేలా .
జనసేన క్రెడిబిలిటీ పెరిగే విధంగా తెరవెనుక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.ముఖ్యంగా ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ద్వారా, ఏపీలో రాజకీయ వ్యూహాలన్ని చక్కబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎన్నికలకు ముందు పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.వైసిపి, టిడిపి పార్టీలలో ఉన్న అసంతృప్తి నాయకులను తమ వైపు తిప్పుకునే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలోని లోపాలను, ప్రభుత్వంపై ప్రజల్లో ఏఏ అంశాల్లో వ్యతిరేకత పెరుగుతోంది అనే అంశాలను పవన్ గుర్తించి వాటిపైనే పోరాటాలకు దిగుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు డోసును ఈ మధ్య కాలంలో పవన్ పెంచారు.
ఒకపక్క తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకోబోతోంది అనే వార్తలపై స్పందించకుండానే పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.ప్రస్తుతం పవన్ జిల్లా పర్యటనలు చేస్తున్నారు.
ఏపీ లో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు.ఈ సందర్భంగా పవన్ ఘాటు వ్యాఖ్యలతో జగన్ పై విరుచుకుపడుతున్నారు.
అలాగే వైసిపి నాయకులు తనను ఉద్దేశించి చంద్రబాబుకు దత్తపుత్రుడు అంటూ చేస్తున్న విమర్శలపై ఆయన ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.

ఏపీ సీఎం జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలన్నీ బూటకం అనే విషయం తేలిపోయిందని, ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి ప్రజా సమస్యలను జగన్ తెలుసుకోవాలని , అలాగే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను జగన్ పరామర్శించాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ సందర్భంగా జన సైనికుల్లో ఉత్సాహం పెరిగే విధంగా పవన్ వ్యాఖ్యానిస్తున్నారు.ఏపీలో జనసైనికులు జోలికి వస్తే ఊరుకునేది లేదు అంటూ హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ ప్రకటనలు, పర్యటనలతో జనసేన నాయకులతో పాటు, జనాలలోను సానుకూలత ఏర్పడుతోంది.ఇదే వైఖరిని పవన్ ఎన్నికల వరకు కొనసాగిస్తే ఆశించిన స్థాయిలో జనసేన కు ఆదరణ పెరుగుతుంది అని, ఎన్నికల్లో కలిసి వస్తుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.