తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ క్యాడర్ నిరసనలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే.స్కిల్ డెవలప్మెంట్ కేసులో.రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో.20 రోజులకు పైగా ఉన్నారు.మరోపక్క చంద్రబాబు కుటుంబ సభ్యులు సైతం దీక్షలు చేస్తూనే న్యాయపోరాటాలు చేస్తూ ఉన్నారు.ఇదిలా ఉంటే చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నంద్యాల నుంచి రాజమహేంద్రవరం పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై వైసీపీ నాయకులు దాడులు చేసినట్లు.
నారా లోకేష్ ట్విట్టర్ లో సీరియస్ పోస్ట్ పెట్టారు.
“జగన్ సైకోయిజం వైసీపీ కార్యకర్తలకీ అంటుకుంది.రాజ్యాంగవ్యవస్థల విధ్వంసానికి పాల్పడుతూ, ప్రశ్నించే ప్రతిపక్షనేతల్నే కాకుండా ప్రజల్ని కూడా హింసిస్తూ సైకో జగన్ తన శాడిజం చూపిస్తున్నాడు.అధినేత చూపిన ఫ్యాక్షన్ బాటలో వైసీపీ కేడర్ పయనిస్తూ సామాన్యులని భయభ్రాంతులకి గురిచేస్తున్నారు.
చంద్రబాబు గారి అక్రమ అరెస్టుని నిరసిస్తూ శాంతియుత పోరాటం చేస్తున్న భువనేశ్వరి గారికి సంఘీభావం తెలుపుతూ నంద్యాల నుంచి రాజమహేంద్రవరం వరకూ పాదయాత్రగా వెళ్తోన్న నారాయణ అనే టిడిపి అభిమానిపై దాడి అమానవీయం.వృద్ధుడు అని చూడకుండా దాడి చేశారంటే వీరు ముమ్మాటికీ వైకాపా సైకోలే” అని లోకేష్ మండిపడ్డారు.