అన్ని రాష్ట్రాల్లోనూ అవే హామీలు ! భారీ ఆశలతో కాంగ్రెస్ 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన విజయాన్ని కాంగ్రెస్ ( Congress party )మర్చిపోలేకపోతోంది .ముఖ్యంగా అక్కడ కాంగ్రెస్ గెలవడానికి కారణం ఎన్నికల హామీలేనని ప్రధానంగా నమ్ముతోంది.

 The Same Guarantees In All States, Congress With High Hopes, Karnataka Congress,-TeluguStop.com

మిగతా రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లోను, కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆ రాష్ట్రాల్లోనూ ఇస్తే ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందని బలంగా నమ్ముతోంది .అందుకే త్వరలో జరగబోయే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు భారీగా హామీలను ఇచ్చి సక్సెస్ అవ్వాలనే ఆలోచనతో ఉంది.మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ను గెలిపిస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని,  అలాగే వ్యవసాయ రుణాలను పెండింగ్ విద్యుత్ ఛార్జీలను మాఫీ చేస్తామని ప్రకటించింది.ఈ మేరకు హోం శాఖ సహాయ మంత్రి కమల్ నాథ్( Kamal Nath ) ఈ హామీలను ప్రకటించారు.

Telugu Kamal Nath, Telangana-Politics

బిజెపి ( BJP party )పాలనలో రైతులపై రుణభారం పెరిగిపోయిందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 70% వ్యవసాయ ఆధారితమైనదని  అన్నారు .2018 ఎన్నికల తరువాత ప్రభుత్వం ఏర్పాటు చేశాక తాము 27 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని ప్రకటించారు.ఈ సందర్భంగా ప్రధానంగా ఐదు హామీలను ప్రకటించారు. కృషక్ న్యాయ యువజన ద్వారా రైతులకు ఇన్పుట్ ధరను తగ్గిస్తాం.వ్యవసాయానికి ఉపయోగించే పంపులకు 5 హార్స్ పవర్ లోపు వాటికి అదనంగా ఉచితం విద్యుత్అదిస్తరైతులకు నిరంతరంగా 12:00 విద్యుత్ అందేలా చేస్తాం.వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తాం.

రైతులు నిరసన తెలిపిన సమయంలో వారిపై పెట్టిన కేసులను ఎత్తివేస్తాం.వ్యవసాయం కోసం రైతులు వాడిన విద్యుత్ పెండింగ్ బిల్లులను మాఫీ చేస్తాం అనిప్రకటించారు.

Telugu Kamal Nath, Telangana-Politics

ఇక త్వరలో జరగబోయే తెలంగాణ ఎన్నికల్లోను కర్ణాటక( Karnataka Congress ) మధ్యప్రదేశ్ లో ఇచ్చిన ఐదు హామీలను కాంగ్రెస్ ప్రకటించబోతోంది.ఆయా రాష్ట్రాల్లో అవసరాలకు అనుగుణంగా ఐదు హామీల్లో చిన్న చిన్న మార్పులు చేయాలని నిర్ణయించింది.ఇప్పటికే తెలంగాణకు కాంగ్రెస్ అనేక హామీలను ప్రకటించింది.గతంలో పోలిస్తే కాంగ్రెస్ బాగా బలపడిందని ప్రధానంగా నమ్ముతోంది .ఇటీవల కాలంలో చేరికలు జోరు అందుకోవడంతోపాటు, కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత హామీలు వర్కౌట్ అవ్వడం, ఆ ప్రభావం తెలంగాణ లోనూ కనిపించడం గతంతో పోలిస్తే కాంగ్రెస్ పై జనాల్లో ఆదరణ పెరగడం , బీఆర్ఎస్ ప్రభుత్వంపైనా, బిజెపి పైన పెరుగుతున్న వ్యతిరేకత ఇవన్నీ తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.ఏది ఏమైనా వరుసగా జరిగే వివిధ రాష్ట్రాల్లోని ఎన్నికల్లో కాంగ్రెస్ పాగా వేసే విధంగా వ్యూహాతకంగా నిర్ణయాలు తీసుకుంటూ,  ప్రజల నాడి కి అనుగుణంగా హామీలను ఇస్తూ ఎన్నికల్లో పై చేయి సాధించే విధంగా ప్రయత్నాలు చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube