తెలంగాణ రాష్ట్రంలో బలపడుతున్న బిజెపికి అడ్డుకట్ట వేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ పక్కా ప్రణాళికతో ఉన్నట్టు తెలుస్తోంది.ఇందులో భాగంగానే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, విద్యత్, వ్యవసాయ బిల్లులపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు.
జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని, అందుకు వివిధ రాష్ట్రాల ప్రాంతీయ రాజకీయ పార్టీల నేతలు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు చేయనున్నారు.తొలుత బిజెపికి బద్ద శత్రువుగా ఉన్న కమ్యూ నిస్టులతో దోస్తానా చేయాలని భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా కొందరు టిఆర్ఎస్ నేతలు, కమ్యూనిస్టు నేతలను కలిసినప్పుడు ఇదే విషయాన్ని చెబుతున్నారు.
రాష్ట్రంలో కమ్యూనిస్టులకు ఉన్న పట్టు తగ్గుతున్నప్పటికీ సిపిఐ, సిపిఎం పార్టీలతో దోస్తీ పెట్టుకుంటే జాతీయ స్థాయిలో కొంత ఉపయోగకరంఆ ఉంటుందని టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
అయితే ఇప్పటికే సిఎం కెసిఆర్ సిపిఐతో లోపాయి కారిగా ఒక అభిప్రాయానికి వచ్చినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఇందులో భాగంగానే నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎంఎల్సీ నియోజకవర్గంలో కేసీఆర్ సూచన మేరకే సిపిఐ పోటీలో ఉన్నట్టు చర్చ జరుగుతోంది.
టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా అంతిమంగా టిఆర్ఎస్ కు లాభం కలుగుతుందని రాజకీయ వర్గాల్లో బాగా ప్రచారం జరుగుతోంది.దీనికి తోడు త్వరలోనే కమ్మూనిస్టు పార్టీకి చెందిన కేరళ సిఎంతో కూడా కెసిఆర్ మాట్టడనున్నట్టు తెలిసింది.
డిసెంబర్ 4 తర్వాత రాష్ట్రంలో బిజెపి బలాన్ని అంచనా వేసి వాటి ఆధారంగా టిఆర్ఎస్ భవిష్యత్ కార్యచరణను సీఏం అమలు చేయనున్నారు.కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సిఎం కెసిఆర్ ఆ దిశగా నిర్ణయించారు.
దీనికి సంబంధించిన ముందస్తు వ్యూహాలను ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్టు టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.ముందు రాష్ట్రాల హక్కులు, నిధులు, జిఎస్టి నుంచి రావాల్సిన నిధులు ఇలా అనేక అంశాలపై బిజెపి వ్యతిరేక రాజకీయ పార్టీలతో సమావేశం కావాలని భావిస్తున్నారు.

గల్లీ టూ ఢిల్లీ…
దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి మంచి జోష్లో ఉన్నది.పైగా గ్రేటర్ ఎన్నికల్లో కూడా ప్రధాన పోటీ టిఆర్ఎస్, బిజెకి మధ్యనే ఉన్నట్టు ఒక రకమైన రాజకీయ వాతావరణం నెలకొన్నది.ఎన్నికల ప్రచారమంతా టిఆర్ఎస్ వర్సెస్ బిజెపి అన్నట్టుగానే సాగుతోంది.ఇలాంటి నేపథ్యంలో బిజెపికి అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్లో అసలుకే ఎసరు పడుతుందని సిఎం కెసిఆర్ భావిస్తున్నారు.మరో వైపు ప్రజల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కూడా ఉన్నట్టు టిఆర్ఎస్ గుర్తించింది.పైగా ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు టిఆర్ఎస్ కు పట్టం కట్టారు.
కానీ ఇప్పుడు కొంత మార్పు కావాలని కోరుకుటున్నారు.అందుకే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ కంచుకోటగా మారిన దుబ్బాకలో బిజెపికి పట్టం కట్టారు.
గ్రేటర్ ఎన్నికల్లో కూడా అదే తరహా తీర్పు వస్తే వాటి ప్రభావం మొత్తం రాష్ట్రంలో రాజకీయాలపై పడుతుందని, తద్వారా టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నవారు, ఇతర పార్టీలో ఉన్నవారు కూడా బిజెపిలో చేరే అవకశాలు లేకపోలేదు.తద్వరా రాష్ట్రంలో కమలం బలపడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో గల్లీ ఎన్నికలను సిల్లీగా తీసుకుంటే కారు జోరుకు బ్రేకులు పడక తప్పదు.అందుకే సిఎం కెసిఆర్ ఇప్పటి నుంచే తన భవిష్యత్ కార్యాచరణపై కసరత్తు దాదాపు పూర్తి చేశారు.
గ్రేటర్ ఫలితాల ఆధారంగా ఆ కార్యచరణను ఆచరణలో పెట్టేందుకు సిఎం కెసిఆర్ సిద్ధంగా ఉన్నారు.అందుకే ముందుస్తుగా కమ్యూనిస్టులను రిజర్వుడు చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.