తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో రసవత్తరంగా సాగుతోంది.ఈవారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ నిజంగా బిగ్ బాస్ హిస్టరీ లోనే టఫ్ అని చెప్పవచ్చు.
హౌస్ లోని కంటెస్టెంట్స్ అందరూ ప్రాణాలకు తెగించి మరీ ఆడారు.ఆడ మగ అని తేడా మరిచి ఒళ్ళు హూనం చేసుకున్నారు.
కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో భాగంగా చివరికి అనిల్, బాబా భాస్కర్, అఖిల్, మిత్రశర్మ, శివ లు కెప్టెన్సీ పోటీదారుల గా ఎంపికయ్యారు.ఈ క్రమంలోనే అఖిల్‌కి నటరాజ్ మాస్టర్, అజయ్‌లు సపోర్ట్ చేయగా, శివకి బిందు, అనీల్‌కి హమీదా, బాబా భాస్కర్‌కి అరియానా సపోర్ట్ చేశారు.
అఖిల్ తన బౌల్‌లో వేసిన దాన్ని మిత్రా శర్మకి షేర్ చేశాడు.
అయితే ఒక్కొక్క గ్లాస్‌తో కాకుండా నటరాజ్ మాస్టర్ రెండు గ్లాస్‌లతో వేశాడని బాబా భాస్కర్, హమీదా, అరియానా వాదించారు.
అతన్ని గేమ్ నుంచి డిస్ క్వాలిఫై చేయాలని చెప్పినా అషురెడ్డి వినలేదు.చివరికి రెండు గ్లాస్‌లతో ఆడారు కాబట్టి గేమ్ మళ్లీ స్టార్ట్ కావాల్సిందే అని పట్టుపట్టడంతో అషురెడ్డి గేమ్ మళ్లీ స్టార్ట్ అని చెప్పింది.
సంచాలక్‌గా మరోసారి అట్టర్ ఫ్లాప్ అయ్యింది.తొలిరౌండ్‌లోనే చేతులు ఎత్తేసింది.
ఈ రౌండ్‌లో నటరాజ్ మాస్టర్ అఖిల్‌కి కాకుండా బాబా భాస్కర్‌కి సపోర్ట్ చేశాడు.అఖిల్ ఈసారి మిత్రాకి ఎందుకు సపోర్ట్ చేయలేదు అన్న విషయం అర్ధం కాలేదు.
ఇక ఆమె గేమ్ నుంచి తప్పుకోవడంతో రెండవ రౌండ్ లో అజయ్, నటరాజ్, మిత్రాలు అఖిల్‌కి సపోర్ట్ చేశారు.

ఈ రౌండ్‌లో శివ ఔట్ అయ్యాడు.ఇకపోతే నిన్నటి ఎపిసోడ్‌లో అజయ్‌తో కానీ హౌస్ లో ఎవరితోను నాకు బాండింగ్ లేదు, ఫ్రెండ్ షిప్ లేదు అని చెప్పాడు అఖిల్.కానీ ఈ రోజు కెప్టెన్ కావడం కోసం అజయ్ సహాయం కోరాడు.
అజయ్ కూడా మొదటి నుంచి ఫ్రెండ్ షిప్ అంటే ప్రాణం పెడుతున్న అజయ్, అఖిల్ చెప్పిన విధంగా గేమ్ ఆడుతూ వచ్చాడు.ఇక మరొక సారి అజయ్ పోరాటంతోనే మూడో రౌండ్‌లో కూడా అఖిల్ గెలిచాడు.
బాబా భాస్కర్ మూడో రౌండ్‌లో నిష్క్రమించాడు.చివరికి అనీల్, అఖిల్ ఇద్దరూ మిగలడంతో.
ఎక్కువ మంది అఖిల్‌కి సపోర్ట్ చేయడంతో అఖిల్ ఇంటి కెప్టెన్ అయ్యాడు.







