తెలుగు సినీ ప్రేక్షకులకు సీనియర్ హీరోయిన్, జబర్దస్త్ జడ్జి రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇకపోతే రోజా ఇటీవలే ఆంధ్రప్రదేశ్ మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
ఎప్పటినుంచో కోరుకుంటున్న తన కల నెరవేరడంతో, జబర్దస్త్ షో కి రోజా బాయ్ బాయ్ చెప్పేసింది.అంతేకాకుండా జబర్దస్త్ షో ని వదిలి వెళ్లిపోతున్న సమయంలో షోని మిస్ అవుతాను అంటూ ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే.
తాను ఎప్పటి నుంచో కోరుకున్న మంత్రి పదవి తనకు వచ్చిందని, మంత్రి పదవితో పాటు అదనపు బాధ్యతలు కూడా ఉండటంవల్ల ఇకపై తాను జబర్దస్త్ షోతో, పాటు ఏ ఇతర ఈవెంట్ లాలో కనిపించను అంటూ జబర్దస్త్ స్టేజ్ పై ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే.
జబర్దస్త్ షో నుంచి రోజా వెళ్లిపోతున్న సమయంలో ఈ టీవీ మల్లెమాల వారు ఆమెకు శాలువా కప్పి, ఫ్లవర్ బొకే లను ఇచ్చి సత్కరించారు.
అనంతరం మల్లెమాల టీం తో పాటు జబర్దస్త్ లో ఉన్న కమెడియన్స్ అందరూ రోజాతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చేంజ్ అయ్యారు.జబర్దస్త్ నుంచి రోజా వెళ్లిపోవడంతో వెంటనే ఆమె స్థానంలోకి నటి ఇంద్రజ ఎంట్రీ ఇచ్చింది.
ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన ప్రోమోని చూసి కొందరు అభిమానులు ఆశ్చర్య పోతుండగా ఇంకొందరు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఆ ప్రోమోలో రోజా ప్లేస్ లో రోజా కనిపించింది.
తన సీట్ లో రోజా కనిపించేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.రోజా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి స్కిట్ మధ్యలో పంచ్ లు వేస్తూ సందడి చేసింది.

ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.జబర్దస్త్ కి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన రోజా ని చూసి ఆడియన్స్ ఆశ్చర్య పోవడంతో పాటు, మళ్లీ రీ ఎంట్రీ ఏంటి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.అయితే ఈ ప్రోమో కొత్త ఎపిసోడ్ కీ సంబంధించిందే అయినప్పటికీ షూటింగ్ చాలా రోజుల క్రితం చేసి ఉండొచ్చు అనే అభిప్రాయపడుతున్నారు.లేదంటే రోజా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి ఉండవచ్చు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి రోజా రీ ఎంట్రీ తో మళ్ళీ జబర్దస్త్ కు కల వచ్చినట్లు కనిపిస్తోంది.







