ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన నాటినుండి విద్యా మరియు వైద్య రంగంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా విద్యా విషయంలో పేదవాళ్ళకి భారం కాకుండా.
అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన ఇంకా పలు సంక్షేమ పథకాలతో విద్యార్థులకు తన ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం కల్పిస్తూ ఉన్నారు.పేద పిల్లలు కూడా ఉన్నత చదువులు చదివే రీతిలో పాఠశాలల వాతావరణాన్ని “నాడు నేడు” కార్యక్రమం ద్వారా మారుస్తూ.
నాణ్యమైన విద్య కల్పిస్తున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం ఆన్ లైన్ విద్యా విధానం ద్వారా పాఠశాలలు రన్ అవుతున్న సంగతి తెలిసిందే.
కాగా ఇప్పుడు ఈ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలలో ఆన్లైన్ విద్యా విధానం తీసుకురావడం జరిగింది.ఈ క్రమంలో ప్రతి పాఠశాలలో వైఫై అందించే దిశగా నిర్ణయం తీసుకున్న జగన్ తాజాగా విద్యార్థులకు ట్యాబ్ లకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్ పంపిణీ కార్యక్రమం వేగవంతం చేయాలని కోరారు.ఈ క్రమంలో ఇప్పటికే లక్షన్నర ట్యాబ్ లు వచ్చినట్లు ముఖ్యమంత్రి కి అధికారులు తెలపగా వాటిలో వెంటనే కంటెంట్ పొందుపరచాలని సీఎం సూచించారు.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే 8వ తరగతి విద్యార్థులకు మరియు టీచర్లకు 5,18,740 ట్యాబ్ లు పంపిణీ చేయడానికి ప్రభుత్వం రెడీ అయ్యింది.