మావోయిస్టుల లేఖపై ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు స్పందించారు.ఇలాంటి లేఖలపై స్పందించాల్సి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యనించారు.
తాను భూములు ఆక్రమించుకున్నట్లు లేఖలు వచ్చాయి.కానీ ఆ భూములతో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.
లేఖలో పేర్కొన్నట్లు పేదల భూములను కబ్జా చేస్తున్నట్లు ప్రకటించిన వార్తలు అవాస్తవం అని చెప్పారు.ఆ అంశాలతో కానీ, రామకృష్ణాపురంలో భూములకు తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
ఒక అసమ్మతి నేత తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.







