బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ హీరోగా దిల్ రాజు హరీశ్ శంకర్ కలిసి నిర్మించిన సినిమా ATM.ఈ సినిమాకు కథ కూడా హరీశ్ శంకర్ అందించడం విశేషం.జీ 5లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు.జనవరి 20న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు.జీ 5లో తెలుగు ప్రేక్షకులను అలరించే ఎన్నో మంచి సినిమాలు వస్తున్నాయి.వాటితో పాటుగా ఈ ATM కూడా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుందని అంటున్నారు.
హరీశ్ శంకర్ కథ కాబట్టి సినిమాపై స్పెషల్ ఎట్రాక్షన్ ఏర్పడింది.వీజే సన్నీ ఈ సినిమాలో దొంగగా కనిపిస్తున్నాడు.రీసెంట్ గా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక సీసీ ఫుటేజ్ వీడియో లీక్ చేశారు.అయితే ఆ వీడియో ఎడిటింగ్ చేసి ఉండటంతో ఆడియన్స్ కాస్త కనిపెట్టేశారు.
ఏటిఎం సినిమా తో సన్నీ ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తాడో చూడాలి.ఈ సినిమాను రాధా సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సి చంద్ర మోహన్ డైరెక్ట్ చేశారు.
ఈ సినిమాతో పాటుగా సన్నీ అన్ స్టాపబుల్ మూవీతో కూడా వస్తున్నాడు.సప్తగిరితో పాటుగా కామెడీ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు సన్నీ.