అందరు మాట్లాడుతున్నారు.. సుధీర్‌ స్పందించడేం?

జబర్దస్త్‌ షో గురించి.అందులో చేసే కమెడియన్స్ గురించి ముఖ్యంగా మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ గురించి కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంను రేపుతున్నాయి.

 Why Sudigali Sudheer Not Responding Abou Kirrak Rp Jabardasth Comments Details,-TeluguStop.com

ఆయనకు మద్దతు తెలుపుతున్న వారు లేరు.కాని ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తున్న వారు లెక్కలేనంత మంది ఉన్నారు.

ఆయనకు సన్నిహితులుగా ఉన్న వారు కూడా ఆయన్ను విమర్శిస్తూ ఉన్నారు.తల్లిలాంటి మల్లెమాల జబర్దస్త్‌ ను అంతేసి మాటలు అనడానికి ఆర్పీ కి నోరు ఎలా వచ్చింది అంటూ జబర్దస్త్‌ కు చెందిన చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

ఆర్పీ ఇంటర్వ్యూ వచ్చిన వెంటనే అదే యూట్యూబ్‌ ఛానల్‌ లో ఆది మరియు రామ్‌ ప్రసాద్‌ లు వచ్చి స్పందించారు.ఆర్పీ అలా మాట్లాడటం ఏమాత్రం సబబు కాదు అన్నాడు.

సుధీర్ గురించి కూడా ఆర్పీ కీలక వ్యాఖ్యలు చేశాడు.అత్యంత అవమానకరంగా సుధీర్ ను మల్లెమాల వారు బయటకు పంపించారు అంటూ ఆర్పీ తీవ్రంగా మండి పడ్డాడు.

ఆ విషయమై సుధీర్ నుండి స్పందన కోసం అంతా వెయిట్‌ చేస్తున్నారు.ప్రస్తుతం సుడిగాలి సుధీర్ మల్లెమాల లో లేడు.ఆయన స్టార్‌ మా లో కామెడీ స్టార్స్ లో చేస్తున్నాడు.కనుక ఆర్పీ చేసిన వ్యాఖ్య లను ఆయన ఖండించడం లేదు.

Telugu Hyper Aadir, Jabardast, Jabardasth, Kirrak Rp, Mallemala, Ram Prasad-Movi

ఆయన ఖండించకుంటే మాత్రం ఆ వ్యాఖ్య లు నిజమే అన్నట్లుగా ఒప్పుకున్నట్లు అవుతుందని జబర్దస్త్‌ అభిమానులు అంటున్నారు.సోషల్‌ మీడియా ద్వారా అయినా కూడా ఆర్పీ వ్యాఖ్య లపై సుధీర్ స్పందిస్తాడేమో అంటూ ప్రతి రోజు కూడా ఆయన సోషల్ మీడియా పేజీని తెగ చూస్తున్న వారు ఉన్నారు.కాని సుదీర్ మాత్రం స్పందించడం లేదు. సుధీర్ ఇలాంటి వివాదాలకు దూరం ఉండాలని భావిస్తున్నాడు.అందుకే స్పందించేందుకు ఆసక్తి చూపడం లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube