హైదరాబాద్, ఆగష్టు 30, 2022: ఎన్నో అద్భుతమైన రియాలిటీ షోస్ తో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న జీ తెలుగు, ఇటీవలే డాన్స్ ఇండియా డాన్స్ – తెలుగు మొదటి సీసన్ ప్రారంభించిన విషయం తెలిసిందే.రెండు బ్లాక్ బస్టర్ లాంచ్ ఎపిసోడ్స్ ద్వారా 10 కంటెస్టెంట్ జోడీలను వీక్షకులకు పరిచయం చేసిన ఛానల్, ఇప్పుడు కాంపిటీషన్ ఫేస్ ను మునుపెన్నడూలేని విధంగా ప్రారంభించనుంది.
సూపర్స్టార్ మహేష్ బాబు కాంపిటీషన్ ఫేస్ ను ‘ఫ్లాగ్ ఆఫ్’ చేయబోతుండగా, తన కూతురు సితారతో కలిసి మొదటిసారి ఒక రియాలిటీ షో లో కనిపించనున్నారు.కంటెస్టెంట్స్ యొక్క మైమరపించే ప్రదర్శనలతో పాటు మహేష్-సితారలు యాంకర్స్ మరియు జడ్జెస్ తో చేసే సందడి చూడాలంటే, సెప్టెంబర్ 4న (ఆదివారం) రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే డాన్స్ ఇండియా డాన్స్ ఎపిసోడ్ ని చూడాల్సిందే.
మహేష్ బాబు తనదైన కామెడీ టైమింగ్ తో అలరించబోతుండగా, సితార వాళ్ళ నాన్నతో చేసే అల్లరి ఎపిసోడ్ కే హైలైట్ గా నిలవనుంది.అంతేకాకుండా, తన ముద్దు ముద్దు మాటలతో మరియు చక్కని డాన్స్ప్ర దర్శనతో సితార ఈ వారం ‘జీ తెలుగు’ ప్రేక్షకులను కనువిందు చేయనుంది.
కాంపిటీషన్ ఫేస్ ను ప్రారంభించిన అనంతరం మహేష్ బాబు మాట్లాడుతూ, “సీతారకు డాన్స్ మీద ఉన్న మక్కువ నన్ను ఈ షో కి వచ్చేలాచేసింది.అంతేకాకుండా, మొదటిసారి నా కూతురితో కలిసి ఒక టీవీ షో లో కనిపించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.
ఇది ఎప్పటికి మరిచిపోలేని ఒక స్పెషల్ మూమెంట్.ఎన్నో భాషలలో సూపర్ హిట్ గా నిలిచిన డాన్స్ ఇండియా డాన్స్ ఇప్పుడు తెలుగులో రావడం మరియు ‘జీ తెలుగు’ మారుమూల గ్రామాల నుండి టాలెంట్ ని వెలుగులోకి తేవడం అభినందనీయం.
ఈ షో లో పాల్గొంటున్న ప్రతిభావంతులైన పోటీదారులందరూ ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకుంటూ తమ కళలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాను.ఆదేవిందంగా, ఈ షో కి తమను ఆహ్వానించిన ‘జీ తెలుగు’ కి ప్రత్యేక ధన్యవాదాలు,” అని చెప్పారు.
సితార షో లో తన అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకుంటూ.”నేను ఒక టీవీ షో స్టేజ్ పై రావడం ఇదే మొదటిసారైనప్పటికీ నాన్న నా పక్కన ఉండటం వల్ల ఎంతో సాఫీగా గడిచిపోయింది.నాకు డాన్స్ అంటే ఎంతో ఇష్టం మరియు కంటెస్టెంట్స్ యొక్క పెరఫార్మన్సెస్ నాకు ఎంతో స్ఫూర్తిని కల్పించాయి.నా మొదటి టీవీ షో ఎక్స్పీరియన్స్ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను.నన్ను డాన్స్ ఇండియా డాన్స్ కి తీసుకువచ్చిన నాన్నకి స్పెషల్ థాంక్స్,” అని చెప్పుకొచ్చింది.‘జీ తెలుగు’ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ అనురాధ గూడూరు షో కి విచ్చేసినందుకు మహేష్ బాబు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ…”ఈ కాంపిటీషన్ ను మహేష్ బాబు తన కూతురితో కలిసి లాంచ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాము.ఇది తప్పకుండా ఇటీవలి కాలంలో వచ్చిన అతిపెద్ద షో లాంచ్లలో ఒకటిగా నిలిచిపోతుంది.డాన్స్ ఇండియా డాన్స్ – తెలుగు ద్వారా ‘జీ తెలుగు’ అద్భుతమైన టాలెంట్ ను వెలికితీసింది.
ఇక నుండి ప్రతి వారం అద్భుతమైన ప్రదర్శనలతో ఈ షో అందరిని అలరిస్తుందని ఆశిస్తున్నాము.మహేష్ బాబు తన కూతురు సితార తో కలిసి చేసిన మొట్టమొదటి టీవీ షో ఎంట్రీ ఈ కార్యక్రమానికి ఎంతో మేలుచేయడంతో పాటు వారి అభిమానులకి కన్నుల పండుగగా నిలవనుంది,” అని చెప్పారు.
డాన్స్ ఇండియా డాన్స్ – తెలుగు ప్రసారానికి కొన్ని గంటల ముందు ‘జీ తెలుగు’ మరో అద్భుతమైన కార్యక్రమంతో ప్రేక్షుకుల ముందుకు రానుంది.ఇటీవలే బోనాలు ఈవెంట్ తో అందరిని అలరించిన ఛానల్, ఇప్పుడు వినాయక చవితి ఫెస్టివల్ ఈవెంట్ మన ఊరి రంగస్థలం తో ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వీక్షకులను ఎంటర్టైన్ చేయనుంది.
ఆ ఫెస్టివల్ ఈవెంట్ కి శ్రీముఖి హోస్ట్ గావ్యవహరిస్తుండగా, నటులు సుధీర్ బాబు మరియు శ్రీ సింహ, దర్శకులు ఇంద్రగంటి మోహన్కృష్ణ మరియుసతీష్ త్రిపుర, గాయకుడు మరియు సంగీత దర్శకుడు కాల భైరవ ప్రత్యేక అతిధులుగా విచ్చేయనున్నారు.అంతేకాకుండా, ప్రముఖ టీవీ నటులు, కమెడియన్స్, సరిగమప కంటెస్టెంట్స్ తమ ప్రదర్శనలతోఆకట్టుకోనున్నారు.
ఈ ఆదివారం (సెప్టెంబర్ 4) మధ్యాహ్నం