టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ అంటూ ఏ ఇండస్ట్రీలో చూసినా ఇప్పుడు అందరి టార్గెట్ ఒక్కటే.పాన్ ఇండియా సినిమా ఇది ఇప్పుడు ఒక ట్రెండ్ గా మారిపోయింది.
గత కొంత కాలంగా సొంత బాషకే పరిమితం అయినా హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇప్పటికే స్టార్ హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటి పాన్ ఇండియా స్టార్స్ అనిపించుకున్నారు.
బాహుబలి సినిమాతో ప్రభాస్, పుష్ప సినిమాతో అల్లు అర్జున్, ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా పాన్ ఇండియా హీరోలుగా ప్రోమోట్ అయ్యారు.మహేష్ బాబు ను రాజమౌళి పాన్ ఇండియా స్టార్ గా చేయబోతున్నాడు.
ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలంతా తమ తమ మార్కెట్ ను బాలీవుడ్ లో ఏర్పరచు కున్నారు.ఇక ఇప్పుడు టైర్ 2 హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటాలని ఎదురు చూస్తున్నారు.
మరి ఈ టైర్ 2 హీరోల్లో నిఖిల్ సిద్ధార్థ్ కూడా ఉన్నారు.ఈయన చిన్న చిన్న రోల్స్ తో తన సినీ ప్రస్థానం స్టార్ట్ చేసి ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా హీరో అనిపించు కున్నాడు.
ఇటీవలే ఈయన నటించిన కార్తికేయ 2 రిలీజ్ అయ్యింది. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో సూపర్ హిట్ అయ్యింది.ఆగష్టు 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యిన ఈ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా బాలీవుడ్ లో వండర్ క్రియేట్ చేస్తుంది.ఈ సినిమా రిలీజ్ అయ్యి 16 రోజులవుతున్న ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో మన్హసి కలెక్షన్స్ రాబడుతుంది.
ఈ సినిమాతో నిఖిల్ పాన్ ఇండియా స్టార్ అనిపించు కున్నాడు.మన టాలీవుడ్ స్టార్ హీరోల లాగానే నిఖిల్ కూడా బాలీవుడ్ లో తన మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు.స్టార్ హీరోల తర్వాత టైర్ 2 హీరోల్లో నిఖిల్ మాత్రమే ఇలా హిందీలో మార్కెట్ సొంతం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసాడు.కార్తికేయ 2 సినిమా ఈ రేంజ్ లో హిట్ అవుతుంది అని ఎవ్వరూ ఊహించలేదు.ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 88.90 కోట్లు కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేస్తుంది.