ఆస్ట్రేలియాలో జరిగిన 6వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ఎంతో ఘనంగా జరిగింది.భారత దేశంలో కంటే కూడా విదేశీ గడ్డపైనే తెలుగు బాష , తెలుగు సంస్కృతి ఓ వెలుగు వెలుగుతున్నాయని.
విదేశాలలో ఉండే తెలుగువారు ఇందుకు ఎంతో కష్టపడుతున్నారని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు.ఈ కార్యక్రమానికి అమెరికాలోని వంగూరి ఫౌండేషన్.
విశాఖలోని లోక్‌నాయక్ ఫౌండేషన్.ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్ సభ్యులు అందరూ హాజరయ్యారు.

తెలుగు బాషని పరిరక్షిస్తున్న ఈ సంస్థల ఆధ్వర్యంలో నవంబరు 3, 4 తేదీలలో మెల్‌బోర్న్‌లో జరిగిన సాహితీ సదస్సులో దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.విదేశీ గడ్డపై తెలుగు భాషను.సంస్కృతిని అద్భుతంగా కాపాడుతుంటే , మాతృభూమిలో తెలుగు భాష పరిస్థితి తలచుకుని దుఃఖం కలుగుతోందని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు.

ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో తొలి తెలుగువారైన డాక్టర్ దూర్వాసుల మూర్తికి జీవన సాఫల్య పురస్కారం అందజేశారు…ఆస్ట్రేలియా, మలేషియాలో తెలుగు వెలుగుకోసం పాఠశాలలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను సన్మానించారు.







