దారుణ హత్యకు గురైన బీజేపీ కార్యకర్త.. ?

ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు జరుగుతున్నాయంటే అక్కడ అల్లర్లు చెలరేగడం, కార్యకర్తల మధ్య హింస చోటు చేసుకోవడం తెలిసిన విషయమే.ఒక్కోసారి అయితే ప్రాణాలు కూడా పోయే పరిస్దితులు తలెత్తుతాయి.

 West Bengal Bjp Activist Mangal Soren Brutally Murdered , West Bengal, Midnapore-TeluguStop.com

ఇకపోతే పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ మిడ్నాపూర్‌ జిల్లాలో ఓ బీజేపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు.

మరణించిన అతను 35 ఏళ్ల మంగల్‌ సోరెన్ అని, ఇతను కేశియారీలోని బేగంపూర్‌ ప్రాంతానికి చెందినవాడని సమాచారం.

కాగా ఈ రోజు ఉదయం తాను నివాసం ఉంటున్న ఇంటి బయట విగతజీవిగా పడిఉన్న సోరెన్ చూసిన కుటంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారట.

ఇదిలా ఉండగా సోరెన్ ను టీఎంసీ గూండాలే హతమార్చారని బీజేపీ ఆరోపిస్తోంది.ఇక సోరెన్‌ హత్య సందర్భంగా ఇక్కడ ఎలాంటి ఘర్షణ చోటు చేసుకోకుండా కేంద్ర బలగాలు ఈ ప్రాంతంలో మోహరించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube