న్యాచులర్ స్టార్ నాని ప్రస్తుతం టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు.నాని కెరీర్ లో 26 వ సినిమాగా టక్ జగదీష్ రాబోతుంది.
ఈ సినిమా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే నిన్ను కోరి సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది.
అందుకే ఈ సినిమాపై కూడా అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, పాటలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాను శివ నిర్వాణ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో నానికి జోడీగా రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.అయితే ఇప్పుడు టక్ జగదీష్ నుండి ఒక అప్డేట్ ఇచ్చారు.ఈ సినిమా ఏప్రిల్ 23 న విడుదల అవుతున్న సందర్భంగా ఇప్పటి నుండే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసాయి.

అందుకే ఈ సినిమాను జనాల్లోకి రీచ్ అయ్యే విధంగా వినూత్నంగా ప్రమోషన్స్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అయిపోయారు.తాజాగా చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది.పరిచయ వేదిక అనే పేరుతో ఈ పోస్టర్ ను విడుదల చేసారు.ఈ రోజు సాయంత్రం రాజమండ్రి మార్గాని ఎస్టేట్ లో ఈ ఈవెంట్ జరుగబోతోంది.ఈ ఈవెంట్ కు చిత్ర యూనిట్ మొత్తం హాజరవ్వబోతుంది.
ఈ ఈవెంట్ లో టక్ జగదీష్ సినిమా కోసం పనిచేసిన యూనిట్ సభ్యులందరినీ పరిచయం చేయబోతున్నారు.
అందుకే ఈ ఈవెంట్ కు పరిచయ వేదిక అని పేరు పెట్టారు.ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు.ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో జగపతిబాబు, నరేష్, నాజర్, రావు రమేష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.