గత నెల టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదాలు చోటు చేసుకున్న విషయం మనకు తెలిసిందే.టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో సెప్టెంబర్ 11వ తేదీ కన్ను మూసిన విషయం మనకు తెలిసింది.
ఈ క్రమంలోని ఈయన మరణ వార్త తెలిసి టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం కదిలి వచ్చింది.అయితే కృష్ణంరాజు గారు మరణించిన సమయంలో బాలకృష్ణ ఇండియాలో లేరు.
ఈయన తన సినిమా షూటింగ్ పనుల నిమిత్తం టర్కీ వెళ్లారు.దీంతో షూటింగ్ లోకేషన్ నుంచి కృష్ణంరాజు గారి మృతికి సంతాపం ప్రకటించారు.
ప్రస్తుతం బాలకృష్ణ ఇండియా తిరిగి రావడంతో ఆయన సతీసమేతంగా కృష్ణంరాజు కుటుంబాన్ని కలిసి పరామర్శించారు.ఈ క్రమంలోనే వసుంధర దేవి బాలకృష్ణ కృష్ణంరాజు ఇంటికి చేరుకొని ఆయన ఫోటోకి నివాళులు అర్పించారు.
అనంతరం కృష్ణంరాజు గారి భార్య శ్యామలాదేవితో చాలాసేపు మాట్లాడి ఆమెను పరామర్శించారు.ఈ క్రమంలోని బాలకృష్ణ తన తండ్రితో పాటు కృష్ణంరాజు గారిని చూస్తూ పెరగానని ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందని తెలియజేశారు.
కృష్ణంరాజుతో పాటు తాను సుల్తాన్, వంశోద్ధారకుడు వంటి సినిమాలలో నటించాలని తెలిపారు.అలాగే ఆయనతో కలిసి గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు.కృష్ణంరాజు మరణం గురించి మాట్లాడుతూ ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు.ఆయన లేని లోటు నుంచి ఎవరు పూడ్చలేరు అంటూ ఈ సందర్భంగా కృష్ణంరాజు గురించి బాలకృష్ణ మాట్లాడుతూ తనతో ఉన్న అనుబంధాన్ని బయటపెట్టారు.
ఇకపోతే ఇందిరా దేవి 11వ రోజు కార్యక్రమాలలో భాగంగా మహేష్ బాబు కుటుంబ సభ్యులను కూడా బాలకృష్ణ పరామర్శించిన విషయం మనకు తెలిసిందే.