దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆదిపురుష్.ఈ సినిమాలో ప్రభాస్ సరసన కృతి సనన్ సీతగా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమా పై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే.డార్లింగ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై భారీగా అంచనాలను పెట్టుకున్నారు.
ఇక ఈ సినిమా నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా అభిమానులు పండగ చేసుకున్నారు.కానీ తాజాగా ఇటీవలే ఆదిపురుష్ సినిమా నుంచి విడుదలైన టీజర్ కు పాజిటివ్ గా కంటే నెగటివ్ గానే ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ టీజర్ విడుదల అయిన మరుసటి రోజు నుంచి ఇప్పటివరకు నెగిటివ్ గా కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి.ఆదిపురుష్ టీజర్ మీద జరిగిన ట్రోల్స్ అన్నీ ఇన్నీ కాదు.
కార్టూన్ సినిమా అని, యానిమేషన్ సినిమా అంటూ గోల చేస్తూ సోషల్ మీడియాలో భారీగా రచ్చ రచ్చ చేసారు.అంతేకాకుండా రాముడు, రావణుడు, హనుమంతుడు గెటప్ ల విషయంలో కూడా భారీగా విమర్శలు వచ్చాయి.
ఈ విషయంపై స్పందించిన చిత్ర బృందం ఈ సినిమా టీజర్ ని 3డిలో చూడాలని,మరొక 20 రోజుల్లో మరొక టీజర్ ను విడుదల చేస్తామని,అప్పుడు తప్పకుండా ప్రేక్షకుల అభిప్రాయం మారుతుంది అని ధీమా వ్యక్తం చేశారు.
తాజాగా విషయం పై టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆదిపురుష్ టీజర్ పై తన అభిప్రాయాన్ని, వస్తున్న ట్రోల్స్ గురించి స్పందించారు.ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.
ఆదిపురుష్ ట్రైలర్ చూశాను.ప్రభాస్ సినిమా అంటే వాడి వేడిగా ఉంటుందని,అంతేకాకుండా రూ.500 కోట్ల భారీ బడ్జెట్ ముంబైలో చేస్తున్నారు అని తెలిపారు.కానీ ఆ ట్రైలర్ చూసిన తర్వాత చాలా డిజప్పాయింట్‌గా అనిపించింది అని తెలిపారు తమ్మారెడ్డి భరద్వాజ.
ఆదిపురుష్ సినిమా ఒక యానిమేషన్ సినిమాలా అనిపించింది.ఈ సినిమాను ప్రెస్‌మీట్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో సినిమాని 3డీలో చూడాలని చెబుతున్నారు.
అయితే 3డీ అయినా 4డీ అయినా యానిమేషన్‌కి లైవ్‌కి తేడా ఉంటుంది.ఇక 3డీలో అయితే పక్షులు, రాక్షసులు మీదకు వచ్చినట్లు కనిపిస్తుంది.
రాముడిని దేవడిగా కొలిచే దేశంలో ఆయన గెటప్‌ని మార్చేయడం విచిత్రంగా అనిపించింది.రావణాసురుడు కూడా బ్రాహ్మణుడు.ఆయనకు కూడా దేవాలయాలు ఉన్నాయి.20 రోజుల్లో అంతా మారిపోతుంది అంటున్నారు.నిజంగా ఆ రిపేర్లు ఏవో చక్కగా చేస్తే మంచిదే.సినిమాని అల్లరి చేయాలని చేయడం లేదు.ఆదిపురుష్ సినిమాకి ఆల్ ది బెస్ట్ అని చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి భరద్వాజ.