క్రిస్మస్ రోజున స్వీపర్‌కి అనూహ్య బహుమతి.. వీడియో చూస్తే మీరూ కన్నీళ్లు పెట్టుకుంటారు!

ఇటీవల ఒక స్కూల్‌లో( School ) జరిగిన ఓ హార్ట్ టచింగ్ ఇన్సిడెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.నిన్న క్రిస్మస్ పండుగ( Christmas ) సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే అయితే దీనికంటే ముందు చాలామంది తమకు ఇష్టమైన వారికి బహుమతులు( Gifts ) అందజేసి సర్‌ప్రైజ్‌ చేశారు.

 Viral Video Teacher Students Surprise Sweeper With Chocolates On Christmas Detai-TeluguStop.com

ఈ క్రమంలోనే టీచర్, స్టూడెంట్స్ కలిసి స్వీపర్‌కి( Sweeper ) ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చి ఆమె కంట ఆనందభాష్పాలు రాలేలా చేశారు.

వైరల్ వీడియో( Viral Video ) ప్రకారం టీచర్ మొదటగా తన క్లాస్‌రూమ్‌ని శుభ్రం చేయమని స్వీపర్‌ని పిలుస్తారు.

ఆమె వచ్చి మాప్‌తో క్లీన్ చేస్తుండగా, టీచర్ ఒక్కసారిగా ఆమె చేతిలోని మాప్‌ని తీసుకుని ఆమెని షాక్‌కి గురిచేస్తారు.టీచర్ ఆమెని తన కుర్చీలో కూర్చోమని అడుగుతారు.

ఆమె కాస్త అయోమయంగా ఉన్నా, టీచర్ మాట విని కూర్చుంటుంది.అంతేకాదు, కళ్లు మూసుకుని చేతులు చాచమని చెప్తారు.

ఆ తర్వాత సీన్ చూస్తే మీ కళ్లల్లో నీళ్లు ఆగవు.

స్టూడెంట్స్ ఒక్కొక్కరుగా వచ్చి ఆమె చేతుల్లో చాక్లెట్స్( Chocolates ) పెడతారు.కళ్లు తెరిచి చూసేసరికి ఆమె ఎమోషన్స్‌ని వర్ణించలేం.అన్ని చాక్లెట్లు, అంత ప్రేమను చూడగానే ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఆ వీడియో చూస్తే మీరూ కన్నీళ్లు పెట్టుకుంటారు.చాక్లెట్స్ చూసి ఆమె ఎంతో సంతోషపడ్డారు.

ఆమె ఫేస్‌లో కనిపించిన ఎక్స్‌ప్రెషన్స్‌కి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.ఆ వీడియో చూసిన నెటిజన్లు టీచర్, స్టూడెంట్స్‌ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

నిజంగా ఇది చాలా హార్ట్‌టచింగ్ మూమెంట్.

‘Figen’ అనే సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకి 7.9 మిలియన్ల వ్యూస్, 65,000 లైక్స్ వచ్చాయి.చాలా మంది ఈ వీడియో చూసి ఎమోషనల్ అవుతున్నారు.“హోల్‌సమ్” అంటూ కొందరు, “ఇది చాలా మంచి ఆలోచన” అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.“డబ్బులు ఇస్తే బాగుండేది” అని కొందరు అభిప్రాయపడినా, చాలా మంది మాత్రం ఈ వీడియోని, టీచర్, స్టూడెంట్స్ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు.ఈ వీడియో సెలవు రోజుల్లో పాజిటివిటీని, మానవత్వాన్ని చాటుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube