డైరీలో ఆ పదమే లేదు.. పెళ్లిపై హన్సిక ఘాటు వ్యాఖ్యలు..?

16 సంవత్సరాల వయస్సులోనే దేశముదురు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హన్సిక ఎంట్రీ ఇచ్చింది.తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన హన్సిక తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్ గా నటించింది.

 Hansika Sesnational Comments About Her Marriage, Tollywood , Viral, Telugu Viral-TeluguStop.com

హీరోయిన్ గా పదుల సంఖ్యలో సినిమాల్లో నటించినా స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేకపోయిన హన్సికకు గత కొంతకాలం నుంచి సరైన అవకాశాలు లేవు.మరోవైపు హన్సిక పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

కొన్ని నెలల క్రితం హన్సిక ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోనుందంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి.అయితే ఆ వార్తలపై హన్సిక స్పందించలేదు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో హన్సిక మాట్లాడుతూ తన పెళ్లి గురించి, వైరల్ అవుతున్న పెళ్లి వార్తల గురించి స్పందించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.కెరీర్ లో అవకాశాలు తగ్గడం నిజమేనని అవకాశాలు తగ్గినంత మాత్రాన పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

Telugu Hansika Motwani, Love Story, Sensational-Movie

ఈ ఏడాది కరోనా విజృంభణ వల్ల చాలామంది సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగాయి.హన్సిక వయస్సు ప్రస్తుతం 29 సంవత్సరాలు.తన డైరీలో పెళ్లి అనే పదానికి చోటు లేదని.కెరీర్ స్లో అయినంత మాత్రాన పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.హన్సిక చేసిన వ్యాఖ్యలను బట్టి ఆమె ఇప్పట్లో పెళ్లి చేసుకోదని అర్థమవుతుంది.గతంతో పోలిస్తే బరువు తగ్గిన హన్సిక ప్రస్తుతం కన్నడ, మలయాళం సినిమాల్లో నటిస్తున్నారు.

అయితే పెళ్లిపై హన్సిక రియాక్షన్ ను చూసి కొందరు నెటిజన్లు హన్సిక భవిష్యత్తులో కూడా పెళ్లి చేసుకోదేమోనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తే హన్సిక వెబ్ సిరీస్ లలో కూడా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

గతంలో ఒక హీరోతో ప్రేమాయణం ద్వారా వార్తల్లో నిలిచిన హన్సిక ఆ హీరోతో విడిపోవడం వల్లే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube