టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా గురించి మన అందరికి తెలిసిందే.మొదట ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన జిల్ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది.ఇక రాశీ ఖన్నా కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూనే ఉంటుంది.
అలా తన అందంతో కుర్రకారుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.అయితే రాశీ ఖన్నా ఇప్పుడిప్పుడే కెరీర్ లో మెల్లిగా స్పీడు అందుకుంటోంది.
రాశి ఖన్నా తన పేరుకు తగ్గట్టుగానే అందంగా బొద్దుగా ముద్దుగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే.రాశి ఖన్నా సౌత్ సినిమాల్లో నటించడం మొదలుపెట్టిన తరువాత జనాలు కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అనేవారట.
ఆ మాటకు రాశి ఖన్నా చాలా సంతోష పడేదట.కానీ ఆ అందమే అనేక అవకాశాలు చేజారటానికి కారణం అయిందట.
ఇకపోతే సినీ పరిశ్రమలో బొద్దుగా, చబ్బి గా ఉన్న హీరోయిన్ లు గొప్ప యాక్టర్స్ అవ్వలేరు అన్న మూఢనమ్మకం ఉంది అన్న విషయం తెలిసిందే.రాశి ఖన్నా గురించి కూడా తన కెరీర్ మొదట్లో ఇదే విధంగా ప్రచారం చేశారట.

ఇంకా కొంతమంది అయితే నేరుగా ఆమెతోనే మీరు చాలా చక్కగా ఉన్నారు.నిన్ను అలా చూడలేను అనే చెప్పేవారట.ఈ విషయంలో రాశి ఖన్నా తన ఆడిషన్ తీసుకొని తను యాక్ట్ చేయగలనో లేదో చూడాలి కదా అని అంటోంది.ఇకపోతే రాశిఖన్నా ప్రస్తుతం నిదానంగా తెలుగు తమిళం లో వరుసగా సినిమాలు చేస్తూ ఊపందుకుంటోంది.
ఇప్పటికే తెలుగు తమిళ ఇండస్ట్రీలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాశి ఇప్పుడు మళ్లీ తిరిగి బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.మొదట మద్రాస్ కేఫ్ ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
ఇకపోతే ఇప్పటికే బాలీవుడ్లో పలువురు హీరోల సరసన నటించి మెప్పించిన విషయం తెలిసిందే.ఇక ప్రస్తుతం మళ్లీ బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చినా రాశి ఖన్నా కు అనుకున్న విధంగా అవకాశాలు వస్తాయో లేదో చూడాలి మరి.







